సైకిల్ హ్యాండిల్ పై నిల్చొని ఇతడు ఎలాంటి స్టంట్స్ చేశాడో చూస్తే మతి పోవాల్సిందే..!

మామూలుగా సీటుపై కూర్చొని పెడల్ ఆడిస్తూ సైకిల్ తొక్కుతుంటారు ప్రజలు.స్టంట్స్ చేసేవారు మాత్రం ఇందుకు భిన్నంగా సైకిల్ తొక్కుతూ అందరినీ ఆకట్టుకుంటారు.

అయితే తాజాగా ఒక వ్యక్తి ఏకంగా సైకిల్ హ్యాండిల్ పై నిల్చొని మతి పోగొట్టే స్టంట్స్ చేశాడు.దీన్ని చూసిన నెటిజన్లు ఇది ఎలా సాధ్యం అంటూ నోరెళ్లబెడుతున్నారు.

ఈ స్టంట్స్ చేసిన వ్యక్తి పేరు మైక్ హక్కర్. ఈ స్టంట్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

దీనికి ఇప్పటికే మూడున్నర లక్షలకు పైగా లైకులు వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో సైకిల్ హ్యాండిల్ పై నిలబడి దాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఒక వ్యక్తిని చూడొచ్చు.

Advertisement

అది కూడా చాలా సన్నగా ఉన్న మార్గంలో! ఇది ఎలా సాధ్యం అయ్యింది అంటే, అతడు ముందుకూ వెనక్కూ ఊగుతూ సైకిల్ని బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా సైకిల్ రైడ్ చేశాడు.సాధారణంగా స్టాండ్ వేసిన సైకిల్ హ్యాండిల్ పై నిల్చోవడం అంటేనే చాలా కష్టం.

అలాంటిది ఇతడు దానిపై నిలబడడమే కాక దాన్ని నడుపుతూ ఆశ్చర్యపరిచాడు.కేవలం సైకిల్ నడపటం మాత్రమే కాదు సైకిల్ తో టర్నింగ్ చేస్తూ, దాన్ని పైకి కిందకీ లేపుతూ అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు.

ఇలాంటి ఫీట్ సాధించడం ఎవరికీ సాధ్యం కాదు.కానీ ఎంతో పట్టుదలతో ప్రాక్టీస్ చేసి దానిని సుసాధ్యం చేశాడు మైక్.

ఈ ఫీట్ చేసేప్పుడు మైక్ తన బ్యాక్ పై తన బరువంతా కేంద్రీకరించాడు.ఈ అద్భుతమైన వీడియోని చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు

ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు