మెడకు ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఫ్యాషన్ అంటే గుర్తొచ్చేది ముందుగా ప్యారిస్( Paris ).ప్రతిరోజు ప్యారిస్ లో ఫ్యాషన్ మారుతూ ఉంటుంది.

ఇక్కడ ఏం చేసినా ఫ్యాషనే.పారిస్ ఎల్వీ ఫ్యాషన్ వీక్ ( LV Fashion Week )లో చేతికి ధరించాల్సిన వాచ్ మెడకు ధరించిన అదొక ఫ్యాషన్ గానే చెప్పుకోవచ్చు.

ఆ వాచీ ఓ సెలబ్రిటీ మెడకు ధరిస్తే ఫ్యాషనే అవుతుంది.పారిస్ ఎల్వీ ఫ్యాషన్ వీక్ లో చేతికి ధరించాల్సిన వజ్రాల వాచి( Watch ) ఓ సెలబ్రెటీ మెడకు ధరించడంతో సోషల్ మీడియా వేదికగా ఆ ఫ్యాషన్ వైరల్ అయింది.

ఇప్పుడు ఆ వజ్రాల వాచీను మెడకు ధరించిన సెలబ్రిటీ ఎవరో.ఆ వజ్రాల వాచీ ఖరీదు ఎంతో.

Advertisement

అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.అమెరికన్ సింగర్, నటి అయినా రిహన్నా( Rihanna ) .ఈమె పాప్ ఐకాన్ స్టైల్, ఐకాన్ మాత్రమే కాదు బిలియనర్ బిజినెస్ వుమెన్ గా ఈమె కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.లూయిస్ విట్టన్ ఫ్యాషన్ వీక్( Louis Vuitton Fashion Week ) లో చేతికి ధరించాల్సిన వాచ్ ను రిహన్నా మెడకు ధరించడంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన వారి దృష్టి అంత ఆ వజ్రాల వాచీపై పడింది.ఆ వాచ్ లో ఉండే వజ్రాలు దగదగలాడిపోతుంటే అలానే చూస్తుండి పోతారు.ఇంత విలువైన వాచ్ ను జాకోబ్ అండ్ కో కంపెనీ( Jacob and Co.Company ) తయారు చేసింది.జాకబ్ అరబో ఈ వాచ్ చోకర్ ని రూపొందించారు.

జాకబ్ అరబొ ఆభరణాలు,వాచ్ డిజైన్ చేయడంలో ఎక్స్పర్ట్.జాకబ్ అరబో రిహాన్నా చిరకాల మిత్రుడు.ఈయన రూపొందించిన వాచ్ విలువ దాదాపు రూ.5.7 కోట్లు.అంతేకాదు ఈ వాచీ ప్రత్యేకత ఏమిటంటే ఈ వాచ్ ను మెడకు చోకర్ లా ధరించడం కూడా ఇదే తొలిసారి కావడంతో వీడియో చూసే వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఈ వాచ్ లో మొత్తం 368 వజ్రాలు పొదిగారు.47 మిల్లీమీటర్ల వైట్ గోల్డ్ బ్రిలియంట్ ఫ్లయింగ్ టూర్ బిల్లన్ ను చోకర్ గా ధరించడానికి వీలుగా తయారు చేశారు.గర్భవతి అయిన రిహన్నా వజ్రాల వాచీను చోకర్ లా ధరించి బేబీ బంప్ తో క్యాట్ వాక్ చేసి అందరి దృష్టి తన వైపుకు మళ్ళించుకుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు