ఆ ప్లేసుకు వెళ్తే ఖ‌త‌మే.. ఇంత‌కీ ఏంటా మిస్ట‌రీ!

భూమిపై కొన్ని అత్యంత భయంకరమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయని, వాటి వద్దకు వెళ్తే తిరిగి రాలేమని పెద్దలు కథలు చెప్తుంటారు.

ఇలాంటి భయంకర ప్రదేశాలు రియల్‌గా చూడకపోయినా మనలో చాలా మంది రీల్‌గా అనగా సినిమాల్లో చూసే ఉంటాం.

రకరకాల పేర్లతో పిలవబడే ఈ ప్రాంతాల్లో దయ్యాలు, భూతాలుంటాయనే ప్రచారం కూడా చేస్తుంటారు.అయితే, నిజంగా అవి ఎక్కడున్నాయి? అని మనం ఆలోచించబోం.ఎందుకంటే అది ఊహాజనితం కాబట్టి.

కానీ, మనం ఇప్పుడు తెలుసుకోబోయే సదరు ప్రదేశం నిజంగానే నేలపై ఉంది.అక్కడికి వెళ్లిన వారు తిరిగి వెనకకు వచ్చిన దాఖలాలు లేవట.

ఇంతకీ ఆ గ్రామం ఏంటి? అక్కడున్న మిస్టరీ ఏంటి? తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే.రష్యాలోని ఉత్తర ఒస్సేటియాలోని దర్గావ్స్‌ అనే విలేజ్ ఉంది.

Advertisement

ఈ ఏరియా ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉంటుందట.ఆ ప్లేస్‌ను చూస్తే చాలు.

విపరీతమైన ఫియర్ మనల్ని వెంటాడుతుంది.నిశ్శబ్దమైన ఈ ప్లేస్‌లో పక్షుల కిలకిలరావాలూ వినబడవు.

ఎత్తైన పర్వతాల నడుమ ఉన్న ఈ గ్రామంలోని ఇళ్లు 14వ శతాబ్దంలో నిర్మించబడినట్లు తెలుస్తోంది.స్థానికంగా ఉన్న కథనాల ప్రకారం.

ఈ ప్రాంతంలోకి వెళ్లిన వారు ఎవరూ వెనక్కి తిరిగి రాలేదు.స్థానికులు తమ కుటుంబీకుల డెడ్ బాడీస్‌ను ఇక్కడి నాలుగు అంతస్తుల భవనాల్లో పాతిపెట్టారట.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఇలా పాతిపెట్టడం వెనుకున్న రహస్యమేంటంటే.మరణం తర్వాత కూడా భావోద్వేగ సంబంధాలు కలిగి ఉండటమే.పురావస్తు శాస్త్రవేత్తల వివరాల ప్రకారం.

Advertisement

ఈ ప్రాంతంలో సమాధుల సమీపంలో పడవలు దొరికాయని, తద్వారా ఈ ప్రాంత పూర్వీకులు ఆత్మను నమ్మినట్లు ధ్రువీకరించారు.స్వర్గం చేరుకోవాలంటే ఆత్మ నదిని దాటాలట.

అలా చనిపోయిన తర్వాత ఫిజికల్ డెడ్ బాడీని పడవలో పెట్టేవారని తెలుస్తోంది.అలా డెడ్ బాడీస్‌ను పడవలో ఖననం చేసే ఆచారం ఉండేదని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

అందుకే ఈ ప్రాంతానికి ‘సిటీ ఆఫ్ డెడ్’ అనగా చనిపోయిన వారి నగరం అనే పేరొచ్చిందట.కాగా, ఈ ప్రాంతంలోని భవంతుల్లోని శవాలు ఇప్పటికీ కుళ్లిపోకుండా ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ విషయమై వారు పరిశోధనలు చేస్తున్నారు.

తాజా వార్తలు