ఈ నూనెతో ఇలా చేస్తే నోటి దుర్వాసనతో పాటు ఇన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయా..?

సాధారణంగా చెప్పాలంటే కొబ్బరి నూనె అనగానే మనం జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటాము.

జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో మనం తలకు ఎక్కువగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తూ ఉంటాము.

కానీ కొన్ని ప్రాంతాలలో కొబ్బరి నూనె( Coconut oil ) వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు.అయితే మన దంతా సంరక్షణలో( dental care ) కొబ్బరి నూనె అద్భుతంగా పని చేస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు.

కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది.దీనిలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ సంతృప్త కొవ్వు హెలికోబాక్టర్ పైలోరీ, హెలిటోసిస్ దోహదపడే బ్యాక్టీరియా( Bacteria ) వృద్ధిని నిరోధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

If You Do This With This Oil, Along With Bad Breath, Will All The Health Problem
Advertisement
If You Do This With This Oil, Along With Bad Breath, Will All The Health Problem

చిగుళ్లలో మంట చికాకు కలిగించే చిగుళ్ల వ్యాధికి చికిత్స చేస్తుంది. చిగుళ్ళ వాపు కారణంగా దంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది.కొబ్బరి నూనెలో ఫ్యాటీ ఆసిడ్స్ యాంటీ మైక్రోబయాల్ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి నోటిలోని బ్యాక్టీరియాని తొలగిస్తాయి.కొబ్బరి నూనె పళ్ళ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుంది.

కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చిగుళ్ళు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.మీరు మీ దంతాలను తెల్లగా మెరిపించాలనుకుంటే కొబ్బరి నూనె బేకింగ్ సోడాను మిక్స్ చేసి ఆ మిక్స్ తో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బ్రష్ చేయాలి.

If You Do This With This Oil, Along With Bad Breath, Will All The Health Problem

ఆ తర్వాత గోరు వేచ్చని నీళ్లతో నోరు శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే పళ్ళ ఆరోగ్యానికి ఆయిల్ పుల్లింగ్ ఎంతో మంచిది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఆయిల్ పుల్లింగ్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె నోట్లోకి తీసుకోవాలి.ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఆ నూనె నోట్లోని మూల మూలకు వెళ్లేలా చూసుకోవాలి.

Advertisement

ఈ క్రమంలో దీన్ని మింగకుండా జాగ్రత్తగా ఉండాలి.పని పూర్తయ్యాక దాన్ని ఉమ్మి వేయాలి.

ఇక ఏదైనా తినే ముందు లేదా తాగే ముందు నోటిని శుభ్రపరచుకొని ఆ తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది.చిగుళ్లలో వాపు, రక్తస్రావం వంటి సమస్యలు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి.

ఇలాంటి వారు ఆయిల్ ఫుల్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

తాజా వార్తలు