ఏపీ నేతలను ప్రచారానికి పిలుద్దామంటే ... పెద్ద చిక్కే వచ్చేందే ? 

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో( Telangana assembly election ) గట్టెక్కేందుకు బీజేపీ గట్టిగానే కష్టపడుతోంది.

ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్ , బిఆర్ఎస్ ల  మధ్య అన్నట్లుగా పరిస్థితి ఉండడంతో,  దాని నుంచి బయటపడేందుకు బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తోంది .

ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు,  బిజెపి అగ్ర నేతలు అంతా వరుస తెలంగాణలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ,  భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు.

If We Call Ap Leaders For Campaigning Will We Get Into Big Trouble, Telangana, B

అయితే తెలంగాణ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏపీ ప్రభావం ఎక్కువగా ఉండడం,  సెటిలర్స్ అత్యధిక స్థాయిలో ఉండడంతో ఆయా నియోజకవర్గల్లో ప్రచారం నిర్వహించాలని బిజెపి( BJP ) అగ్ర నేతలు ముందుగా భావించినా, ఏపీలో బిజెపి పరిస్థితి గందరగోళంగా మారడంతో, వెనక్కి తగ్గారట.దీనికి కారణం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుపాటి పురందరేశ్వరి ( Daggupati Purandareshwari )పూర్తిగా వైసిపి ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేసుకోవడం,  టిడిపికి( TDP ) అనుకూలంగా వ్యవహరించడం కేంద్ర బీజేపీ పెద్దల అనుమతి లేకుండానే టిడిపి విషయంలో స్పందిస్తూ చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ ఉండడం,  దీనిపై బిజెపిలోని ఒక వర్గం పురందరేశ్వరి పై బహిరంగంగానే విమర్శలు చేస్తూ,  ఆమె టిడిపి కోవర్ట్ అంటూ విమర్శలు చేస్తూ ఉండడంతో,  ఏపీ నేతలు తెలంగాణ ఎన్నికల లో ప్రచారానికి దింపినా నష్టమే తప్ప , ప్రయోజనం ఉండదని అంచనాకు తెలంగాణ బిజెపి నేతలు వచ్చారట.

If We Call Ap Leaders For Campaigning Will We Get Into Big Trouble, Telangana, B

ఈ మధ్యకాలంలో ఏపీ బిజెపి ( AP BJP )లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి .పార్టీలో అసంతృప్తులూ రోజు రోజుకూ పెరిగిపోతున్నారు.తెలంగాణ బిజెపిలో పరిస్థితి అంతంత మాత్రమే ఉంది అనుకుంటూ ఉండగానే , ఏపీలోనూ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో,  అక్కడి నేతలను ఇక్కడికి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఇబ్బందులు తప్పవనే అంచనాకు వచ్చారట .ఇప్పటికే ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు బిజెపి అగ్ర  నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ ఫలితం పెద్దగా కనిపించకపోవడం తో,  తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీపై పూర్తిగా దృష్టి సారించే ఆలోచనలో బిజెపి పెద్దలు ఉన్నారట.

Advertisement
If We Call AP Leaders For Campaigning Will We Get Into Big Trouble, Telangana, B
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

తాజా వార్తలు