'బలగం' లో వేణు హీరోగా చేసి ఉంటే ఎలా ఉండేది అనే ప్రశ్నకు సమాధానం ఇదే

ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా వేణు( Venu ) దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన ఈ సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్స్ నమోదు చేయడం తో పాటు ఓటీటీ లో కూడా సంచలనం సృష్టిస్తుంది.

థియేటర్ల లో ఇంకా ప్రదర్శింపబడుతున్న బలగం చిత్రం సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత వేణు దర్శకుడిగా చాలా ఫేమస్ అయ్యాడు.

ఆయన తో సినిమాలను నిర్మించేందుకు బడా నిర్మాతలు క్యూ కడుతున్నారు.

If Venu Acted As Hero In Balagam What Happen , Venu , Balagam ,kavya Kalyan Ram

ఆయన తన తదుపరి సినిమా ని దిల్ రాజు( Dil raju ) బ్యానర్ లో చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు.ఇక బలగం చిత్రం కథ గురించి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కథ ను రాసుకున్నాను.ఆ సమయంలో నేనే హీరోగా నటించాలని భావించాను.

Advertisement
If Venu Acted As Hero In Balagam What Happen , Venu , Balagam ,Kavya Kalyan Ram

కానీ మిత్రుడి సలహా మేరకు నేను కాకుండా ప్రియదర్శి హీరోగా( Priyadarshi ) సినిమాను రూపొందించాను అంటూ చెప్పుకొచ్చాడు.

If Venu Acted As Hero In Balagam What Happen , Venu , Balagam ,kavya Kalyan Ram

ఒకవేళ వేణు హీరోగా నటించి ఉంటే బలగం సినిమా యొక్క ఫలితం ఏంటి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.బలగం చిత్రం లో కథే హీరో.హీరో పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేదు.

కనుక ఆ పాత్ర ను వేణు వేసిన కూడా బాగానే ఉండేది.కనుక వేణు కు నటుడిగా కూడా మంచి బ్రేక్ లభించే అవకాశం ఉండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియదర్శి కాకుండా వేణు లేదా మరెవరు నటించినా కూడా బలగం చిత్రం నాచురాలిటీ మిస్ అయ్యే అవకాశం ఏం లేదు.కనుక ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది కనుక వేణు దర్శకుడిగా మాత్రమే కాకుండా హీరోగా చేసినా కూడా మంచి ఫలితం ఉండేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు