రైలు ప్రయాణికులు ఈ నిబంధనలు తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!

విమాన ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

టికెట్ బుకింగ్ ( Ticket booking )చేయడం నుంచి లగేజీ చెకింగ్, బోర్డింగ్ పాస్, ( Boarding pass )ఫైట్ ఎక్కడం, దిగడం, తిరిగి లగేజీ తీసుకోవడం వరకూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది.

అందుకే మొదటి సారి విమానం ఎక్కేవారు తప్పనిసరిగా అంతకు ముందు విమానం ఎక్కిన వారి నుండి ఆయా సమాచారాన్ని సేకరిస్తూ వుంటారు.ముఖ్యంగా లగేజీ విషయంలో విమానయాన సంస్థ కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తుంది.

కొంత పరిమిత బరువు వరకూ మాత్రమే అనుమతిస్తుంది.ఆపై బరువు ఉంటే మాత్రం ఆ లగేజి అనుమతించబడదు.

ఇప్పుడు ఈ విషయం ఎందుకని అంటారా? ఇపుడు ఇదే రూల్ రైల్వే వ్యవస్థ( Railway system ) కూడా తీసుకొచ్చింది.వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో అమలులోనే ఉన్నప్పటికీ దీనిగురించి ఎవరికీ తెలియదు.అదేవిధంగా దీనిని సరిగ్గా అమలుచేస్తున్న దాఖలాలు లేవు.

Advertisement

అయితే ఇకపై ఈ రూల్స్ కచ్చితంగా అమలు చేయనుంది ఇండియన్ రైల్వే.అవును, ఇకనుండి రైలులో ప్రయాణించే వారు కూడా తప్పని సరిగా పరిమితి వరకూ లగేజీ తీసుకురావాల్సి ఉంటుంది.

ఆ పరిమితి మించితే ఫైన్ విధించే అవకాశం ఉంటుంది.

మన దేశంలో ప్రధాన రవాణా సాధనం రైలు మార్గం అని అందరికీ తెలిసినదే.ఇక్కడ సాధారణ ప్రజల నుంచి పెద్ద బిజినెస్ పర్సన్ల వరకూ రైలులోనే పయనిస్తూ వుంటారు.సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు తక్కువ చార్జీలు కూడా అందుకు కారణం.

అయితే ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీకి సంబంధించి రైలులో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి.వాస్తవానికి పరిమితికి మించి లగేజీ ఉంటే కచ్చితంగా దానిని టికెట్ తీసుకొనే సమయంలోనే చెప్పి అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల పెనాల్టీలు కూడా చెల్లించే వారు లేకపోలేదు.భారతీర రైల్వే మినిస్ట్రీ ప్రయాణికులు ఎక్కువ లగేజీని రైళ్లలో తీసుకెళ్లవద్దని సూచించింది.

Advertisement

రైలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుడు గరిష్టంగా 50కేజీల వరకూఉచితంగా రైలులో తీసుకెళ్ల వచ్చు.ఆ పైన తీసుకెళ్తే కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

తాజా వార్తలు