ఇంటర్నెట్ ప్రపంచంలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ( Artificial intelligence )పెను సంచలనాలు నమోదు చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.ఈ క్రమంలోనే ఈ అత్యాధునిక సాంకేతిక మనిషికి మేలు చేస్తుందా? కీడు కలిగిస్తుందా? అనే విషయంపైన ప్రతిక్షణం ఎక్కడో ఒకచోట డిబేట్ జరుగుతూనే వుంది.కొంతమంది దీనిపట్ల సముఖంగా ఉంటే, మరికొంతమంది విముఖంగా వుంటున్నారు.దీనితో ప్రపంచ వినాశనం తప్పదని కొందరంటుంటే.మరికొందరు ఇది ఏకంగా మనిషికి ప్రత్యామ్నాయం కాగలదని అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో కొన్ని రంగాల్లో పనిచేసేవారు పనే లేకుండా పోతుందేమోనని భయపడుతున్న పరిస్థితి.అయితే ఎఐ క్రేజ్ ని బట్టి దీనికి సంబంధించిన ఏదో ఒక కొత్త విషయం నిత్యం వార్తల్లో నిలుస్తూనే వుంది.ఈ అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న వారు మాత్రం సులభంగా దాని ప్రయోజనాలు పొందగలుతున్నారు.
అదే సమయంలో దానిని ఉపయోగించి మోసాలకు పాల్పడే వారు కూడా ఇటీవల కాలంలో ఎక్కువవున్నారని తాజా సర్వేలలో తేలింది. సైబర్ నేరాల్లో( Cyber crimes ) కొత్త టెక్నిక్ లను తీసుకొస్తున్నారు.
ఏకంగా ఏఐ టూల్స్ ఆధారంగా వ్యక్తుల పాస్ వర్డ్ లు కాజేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

కాగా ఇది చాలా దారుణమైన చర్యలాగా అనిపిస్తోంది.ఏదో లింక్ లు పంపడమో, మేసేజ్ పంపడమో కాదండోయ్… అసలు మన ప్రమేయం లేకుండానే.ఎటువంటి లింక్ లు క్లిక్ చేయకుండానే.
కేవలం కంప్యూటర్, లేదా ల్యాప్ టాప్ కీబోర్డులో టైప్ చేయడం ద్వారా పాస్ వర్డ్ లను హ్యాక్ చేసేస్తారని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ మేరకు యూనైటెడ్ కింగ్ డమ్( United Kingdom ) కు చెందిన కొందరు కంప్యూటర్ శాస్త్రవేత్తలు ఓ ఏఐ టూల్ ను గుర్తించినట్టు చెబుతున్నారు.
మీరు కీబోర్డులో టైప్ చేస్తున్నప్పుడు శబ్దాలను విశ్లేషించే టెక్నాలజీ దీనిలో ఉందట.దీని ద్వారా హ్యాకర్లు మీరు టైప్ చేస్తున్న కచ్చితమైన అక్షరాలు, సంఖ్యలను పసిగట్టగలుతారని నిపుణులు చెబుతున్నారు.
దుర్హామ్, సర్రే,రాయల్ హోల్లోవే యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించగా తాజా విషయాలు బయటపడ్డాయి.







