రైలు ప్రయాణికులు ఈ నిబంధనలు తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!

విమాన ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.టికెట్ బుకింగ్ ( Ticket booking )చేయడం నుంచి లగేజీ చెకింగ్, బోర్డింగ్ పాస్, ( Boarding pass )ఫైట్ ఎక్కడం, దిగడం, తిరిగి లగేజీ తీసుకోవడం వరకూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది.

 If The Train Passengers Do Not Know These Rules, There Will Be Trouble, Train Ne-TeluguStop.com

అందుకే మొదటి సారి విమానం ఎక్కేవారు తప్పనిసరిగా అంతకు ముందు విమానం ఎక్కిన వారి నుండి ఆయా సమాచారాన్ని సేకరిస్తూ వుంటారు.ముఖ్యంగా లగేజీ విషయంలో విమానయాన సంస్థ కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తుంది.

కొంత పరిమిత బరువు వరకూ మాత్రమే అనుమతిస్తుంది.ఆపై బరువు ఉంటే మాత్రం ఆ లగేజి అనుమతించబడదు.

Telugu Latest, Luggage, Railway Tips, Ticket, Train-Latest News - Telugu

ఇప్పుడు ఈ విషయం ఎందుకని అంటారా? ఇపుడు ఇదే రూల్ రైల్వే వ్యవస్థ( Railway system ) కూడా తీసుకొచ్చింది.వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో అమలులోనే ఉన్నప్పటికీ దీనిగురించి ఎవరికీ తెలియదు.అదేవిధంగా దీనిని సరిగ్గా అమలుచేస్తున్న దాఖలాలు లేవు.అయితే ఇకపై ఈ రూల్స్ కచ్చితంగా అమలు చేయనుంది ఇండియన్ రైల్వే.అవును, ఇకనుండి రైలులో ప్రయాణించే వారు కూడా తప్పని సరిగా పరిమితి వరకూ లగేజీ తీసుకురావాల్సి ఉంటుంది.ఆ పరిమితి మించితే ఫైన్ విధించే అవకాశం ఉంటుంది.


Telugu Latest, Luggage, Railway Tips, Ticket, Train-Latest News - Telugu

మన దేశంలో ప్రధాన రవాణా సాధనం రైలు మార్గం అని అందరికీ తెలిసినదే.ఇక్కడ సాధారణ ప్రజల నుంచి పెద్ద బిజినెస్ పర్సన్ల వరకూ రైలులోనే పయనిస్తూ వుంటారు.సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు తక్కువ చార్జీలు కూడా అందుకు కారణం.అయితే ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీకి సంబంధించి రైలులో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి.వాస్తవానికి పరిమితికి మించి లగేజీ ఉంటే కచ్చితంగా దానిని టికెట్ తీసుకొనే సమయంలోనే చెప్పి అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల పెనాల్టీలు కూడా చెల్లించే వారు లేకపోలేదు.

భారతీర రైల్వే మినిస్ట్రీ ప్రయాణికులు ఎక్కువ లగేజీని రైళ్లలో తీసుకెళ్లవద్దని సూచించింది.రైలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుడు గరిష్టంగా 50కేజీల వరకూఉచితంగా రైలులో తీసుకెళ్ల వచ్చు.

ఆ పైన తీసుకెళ్తే కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube