అంతా బాగుంటే సమంత, చైతూ ఈ సంవత్సరం అమ్మ, నాన్న అయ్యేవారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఏడు సంవత్సరాల ప్రేమ తరువాత పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట 4 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు.

అయితే వీరిద్దరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో పలు మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన  ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈ విషయం విన్న ఎంతో మంది అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

అయితే సమంత నాగ చైతన్య తిరిగి మళ్ళీ కలుసుకుంటే చాలా బాగుంటుందని ఎంతో మంది అభిమానులు చాలా ఆశగా ఎదురు చూశారు.అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి చూస్తుంటే ఇక పై ఆశలు తీరేలా లేవని చెప్పవచ్చు.

ఇలా విడాకులు ప్రకటన తర్వాత సమంత నాగ చైతన్య పూర్తిగా వారి కెరీయర్ పై దృష్టి సారించి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఇదిలా ఉండగా ఎంతో మంది అభిమానులు గతంలో సమంత తమ వైవాహిక జీవితం గురించి చేసిన కొన్ని క్యూట్ కామెంట్స్ ను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో అస్క్ మీ ఏనీ థింగ్ లైవ్ చాట్ నిర్వహించారు.ఈ క్రమంలోనే అభిమానులతో ముచ్చటించిన సమంతకు అభిమానుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే కొంత మంది అభిమానులు ఈ లైవ్ చాట్ ద్వారా సమంత ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నలు అడిగారు.

ఈ ప్రశ్నలకు సమంత స్పందిస్తూ.మీరు నా శరీరంలో మార్పుల కోసం ఎదురు చూస్తున్నారని నాకు అర్థం అవుతుంది ఈ క్రమంలోనే మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నా 2022 ఆగస్టు 7వ తేదీ ఉదయం ఏడు గంటలకు నేను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అంటూ లైవ్ చాట్ ద్వారా తెలియజేశారు.

ఇలా గతంలో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలను అభిమానులు తీవ్ర స్థాయిలో వైరల్ చేస్తున్నారు.ఇకపోతే సమంత నాగ చైతన్యల విషయం లో అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఈ ఏడాది ఈ దంపతులకు ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చి అమ్మనాన్నలు అయ్యేవారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీరి విడాకుల గురించి ప్రకటించి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఇద్దరు కలిస్తే చాలా బాగుంటుందని ఎంతో మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే వీరిద్దరూ తిరిగి కలిసే అవకాశాలు లేవని తెలిసినప్పటికీ అభిమానులు మాత్రం కలిస్తే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఇకపోతే నాగచైతన్య సమంత వీరిద్దరు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రస్తుతం కెరీయర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు