వేములవాడకు హెలికాప్టర్‌  

Hyderabad To Vemulavada Start The New Helicapter Service To People - Telugu Helicapter, Helicapter Run In Medaram Festival, Telangana Tourisam Minister Srinivas Goud

ఇటీవల మేడారం జాతర సందర్బంగా హెలికాప్టర్‌ సర్వీస్‌లు నడిపిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఔత్సాహికుల కోసం హెలికాప్టర్‌ సర్వీస్‌లను నడపాలనే నిర్ణయానికి వచ్చింది.మహాశివరాత్రి సందర్బంగా హైదరాబాద్‌ నుండి వేములవాడ వరకు హెలికాప్టర్‌ సర్వీస్‌లను నడుపబోతున్నారట.

Hyderabad To Vemulavada Start The New Helicapter Service People - Telugu Run In Medaram Festival Telangana Tourisam Minister Srinivas Goud

ఈ విషయాన్ని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పుకొచ్చారు.ఎంతో మందికి హెలికాప్టర్‌ ఎక్కాలనే ఆశ ఉంటుంది.

కాని అది సొంతంగా ఎక్కాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.అందుకే ఇలాంటి సందర్బాల్లో హెలికాప్టర్‌ సర్వీస్‌లను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.

హైదరాబాద్‌ నుండి వేముల వాడ వరకు వెళ్లాలి అంటే రూ.30 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.ఇక వేములవాడలో హెలికాప్టర్‌ ఎక్కాలి అంటే మూడు వేలు చెల్లించాలి.ఏడు నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టి వేముల వాడ మొత్తం చూపిస్తారు.ఇది లోకల్‌లో మాత్రమే.30 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మాత్రం వేముల వాడ తీసుకు వెళ్లి అక్కడ నుండి మళ్లీ హైదరాబాద్‌కు తీసుకు వస్తుంది.కాస్త ఖరీదు అయినా కూడా హెలికాప్టర్‌ అంటే మోజు ఉన్న వారు వెళ్లవచ్చు.

తాజా వార్తలు

Hyderabad To Vemulavada Start The New Helicapter Service To People-helicapter Run In Medaram Festival,telangana Tourisam Minister Srinivas Goud Related....