కొత్త అధ్యక్షులు రాబోతున్నారట

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

గత ఆరు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా పుంజుకోవడంలో విఫలం అయ్యింది.

ముఖ్యంగా ఏపీలో ఈ పార్టీకి బలం తగ్గుతుంది కాని పెరగడం లేదు.ఇక తెలంగాణలో బలం పెరిగినట్లే అనిపిస్తుంది, ఎప్పుడో అది మళ్లీ తుస్సుమంటుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ పర్చిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో కాస్త పర్వాలేదు అనిపించుకుంది.ఇక మున్సిపల్‌ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యింది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయంకు జాతీయ నాయకత్వం వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.అందుకోసం సన్నాహకాల్లో ఉన్నట్లుగా బీజేపీ సీనియర్‌ నాయకుడు మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు అన్నారు.

Advertisement

జాతీయ అధ్యక్షుడిని కలిసిన ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తామని ఆయన అన్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు