ఈమద్య కాలంలో యూత్‌లో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు.కొందరు టెక్నాలజీని మంచి పద్దతిలో ఉపయోగించుకుంటూ రాణిస్తూ ఉంటే మరో వైపు కొందరు ఆ టెక్నాలజీని చెడ్డ దారిలో ఉపయోగించుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఎంతో మంది కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఈ సమయంలో మన తెలుగు కుర్రాడు అనురాగ్ రెడ్డి అద్బుతమైన ప్రతిభతో పాతిక ఏళ్ల వయసులోనే కోట్ల వ్యాపార సామ్రాజ్యంను ఏర్పాటు చేసుకున్నాడు.

కాలేజ్ రోజుల్లోనే తనకున్న పరిజ్ఞానంను ఉపయోగించుకుని అద్బుతమైన బిజినెస్ ఐడియాలను కనబర్చాడు.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈకామర్స్ బిజినెస్ సాగుతుంది కనుక ఖచ్చితంగా మంచి వ్యాపారం అవుతుందనే ఉద్దేశ్యంతో కాలేజ్ రోజుల్లోనే పెంగ్విన్ కార్ట్‌ను ప్రారంభించాడు.ప్రస్తుతం ఆ ఈకామర్స్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయల తరహాలో సాగుతోంది.
కేవలం పది లక్షల పెట్టుబడితో నెలకొల్పబడిన ఆ వ్యాపారం ప్రస్తుతం కోట్లల్లో సాగుతున్నట్లుగా ఆయన చెబుతున్నారు.
ప్రముఖ కంపెనీలు మరియు సంస్థలు అనురాగ్ రెడ్డిని తమ కంపెనీల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇక పెంగ్విన్ కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి.కాని అనురాగ్ మాత్రం తాను ఇవ్వదల్చుకోలేదు అన్నాడు.
అలా ప్రస్తుతం పెంగ్విన్ కంపెనీ రెండు లక్షల డాలర్ల రెవిన్యూకు చేరుకుంది.పలు ఫ్యాషన్ వస్తువులతో పాటు అనేక రకాలుగా ఈ ప్టోర్‌లో అమ్మకాలు జరుపుతూ ఉంటారు.

ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు.పెంగ్విన్ కార్ట్ బ్రాండ్ కు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఏర్పడటంతో అంతా కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నారు.కాలేజ్ రోజుల్లో అనురాగ్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అతడిని కోటీశ్వరుడిని చేసింది.తెలివిగా టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఇలా అద్బుతాలు ఆవిష్కరించవచ్చు అని అనురాగ్ రెడ్డి నిరూపించాడు.
అందుకే ఇతడు యూత్‌కు ఆదర్శంగా చెప్పుకోవచ్చు.