నడవలేని భార్య కోసం వీల్ చైర్ నే బైక్ లా మార్చిన భర్త...!

ప్రపంచంలో చాలామంది భార్య భర్తలు హాయిగా స్వేచ్ఛగా ఎలాంటి గొడవలు లేకుండా ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు.

అలాగే మరికొందరి జీవితాల్లో ఏదో ఒక చెడు సంఘటన నేపథ్యంలో మంచాన పడటం లేదా, నడవలేకపోవడం, విడిపోవడం లాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం.

అయితే ఇలాంటి సంఘటన ఒకటి ప్రముఖ యూట్యూబ్ స్టార్ జాక్ నెల్సన్ జీవితంలో జరిగింది.తన భార్యకు ఒక గుర్రపుస్వారీ చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆవిడ ఆ సమయంలో జారిపడి పడిపోవడంతో నడుము కింది భాగం మొత్తం పక్షవాతం వచ్చింది.

దీంతో ఆవిడ పూర్తిగా వీల్ చైర్ కు మాత్రమే పరిమితం అయింది.నిజానికి నెల్సన్ భార్య కు అడ్వెంచర్ లు చేయడం అంటే ఎంతో ఇష్టం.

అలా అడ్వెంచర్ చేసే తన భార్య చివరికి అలా వీల్ చైర్ లోనే పరిమితం కావడం నెల్సన్ కు చాలా బాధ వేసింది.దీంతో ఆయన తన భార్యకు సంతోషం కలిగించే విషయం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆవిడ ఉన్న వీల్ చైర్ ను ఏకంగా నాలుగు చక్రాల బైక్ గా మార్చేశాడు.

Advertisement

ప్రకృతిని ఎంతగానో ఆస్వాదించే తన భార్య వీల్ చైర్ ద్వారానే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని చూడగలుగుతున్నాం అని చెబుతున్నాడు.ఇలా వీల్ చైర్ ని ఒక ఒక నాలుగు చక్రాల బైక్ గా మార్చిన నెల్సన్ బైకు రిగ్ అనే పేరును నామకరణం చేశాడు.

ఈ రిగ్ ద్వారా పర్వతాలు, మంచు, ఇసుక, రాళ్ళు ఇలా ఎందులో అయినా సులభంగా ప్రయాణం చేస్తుంది.ఇక ఈ బైక్ ను ఓ ఎలక్ట్రికల్ బైకుల సిద్ధం చేశాడు.

ఈ బైక్ లో మధ్యలో సీటు నుంచి చేతిలో సులభంగా ఇమిడిపోయే హ్యాండిల్స్ తో ఎలక్ట్రిక్ బైకు ను రూపొందించి తన భార్యకు ఇచ్చాడు.ఇకపోతే ప్రస్తుతం ఆ బైక్ లోనే తన భర్త సహాయంతో జాలిగా షికారుకు వెళ్తోంది.

ఈ బైకు ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 30 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి రావచ్చు.అయితే ఈ బైకు గంటకు కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే వెళ్లేలా దాన్ని రూపొందించాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుతం ఈ బైక్ తన భార్య కోసం మాత్రమే కాకుండా ఆమెలా బాధ పడే మిగతా వారికి కూడా ఎంతగానో ఉపయోగపడేలా మారిపోయింది.అలాంటి వారికోసం నెల్సన్ వాటిని అతి తక్కువ ధరకే తయారుచేసి అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు