యూఎస్‌లో భారీ సెటిల్‌మెంట్, రూ.224 కోట్లు చెల్లించనున్న కాలిఫోర్నియా స్కూల్..

మనదేశంలో పాఠశాలల్లో ఇతర విద్యార్థులను వేధించడం తక్కువ కానీ ఫారిన్ కంట్రీస్( Foreign Countries ) లో విద్యార్థులను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణం.

అంతేకాదు స్టూడెంట్స్ పై దారుణమైన దాడులకు పాల్పడడం కామన్‌.

ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నా అక్కడి పాఠశాలలు వీటిని చూసీచూడనట్టు వదిలేయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది.ఒక స్కూల్‌ నిర్లక్ష్యం వల్ల 13 ఏళ్ల బాలుడు అన్యాయంగా చనిపోయాడు.

ఆ తప్పుకు సదరు స్కూల్ ఇప్పుడు భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Huge Settlement In Us, California School To Pay Rs.224 Crores , Bullying, Nri Ne

వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియాలోని ఒక డిస్ట్రిక్ట్ స్కూల్( A school district in California ) కొట్టి చంపబడిన 13 ఏళ్ల బాలుడి కుటుంబానికి రూ.224 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది.ఇది యూఎస్ చరిత్రలో అతిపెద్ద బుల్లీయింగ్ సెటిల్‌మెంట్.

Advertisement
Huge Settlement In US, California School To Pay Rs.224 Crores , Bullying, NRI Ne

డియెగో స్టోల్జ్ ( Diego Stolz )అనే బాలుడిని మరో ఇద్దరు విద్యార్థులు 2019, సెప్టెంబరు 16న దారుణంగా హింసించారు.వారి దాడిలో అతను నేలపై పడ్డాడు.

అనంతరం వారు ఆ బాలుడి తలను కాంక్రీట్ స్తంభానికి బలంగా గుద్దారు.దీంతో బాలుడి మెదడుకు తీవ్ర గాయమైంది.

అతను తొమ్మిది రోజుల తరువాత మరణించాడు.

Huge Settlement In Us, California School To Pay Rs.224 Crores , Bullying, Nri Ne

డియెగో కుటుంబం స్కూల్ డిస్ట్రిక్ట్‌పై దావా వేసింది.ఎందుకంటే స్టోల్జ్ ను ఇతర విద్యార్థుల వేధిస్తున్నారని పాఠశాలకు తెలుసు, కానీ దానిని ఆపడానికి వారు ఏమీ చేయలేదు.డియెగో ప్రాణాలను కాపాడడానికి డిస్ట్రిక్ట్ కోర్టు ఎలాంటి చర్యలు పట్టించుకోలేదని కుటుంబం వాపోయింది.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

ఇద్దరు 14 ఏళ్ల బాలురు జువైనల్ కోర్టులో నరహత్య, దాడికి అల్పడినట్లు రుజువయింది.వారికి 47 రోజుల జైలు శిక్ష విధించారు.అలాగే సమాజ సేవ చేయాలని పనిష్మెంట్ ఇచ్చారు.

Advertisement

కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆదేశించారు.బుల్లీయింగ్ అనేది ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించబడుతుంది.

ఈ కేసుతో పాఠశాలలు జాగ్రత్త పడతాయని డియెగో కుటుంబం భావిస్తోంది.వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులన్నింటినీ పాఠశాలలు సీరియస్‌గా తీసుకుని విద్యార్థులను వేధింపులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

తాజా వార్తలు