ఊహించని అతిధిని చూసి షాక్ అయిన వ్యక్తి.. ఇంతకీ ఎవరబ్బా..!

ఒక వ్యక్తి అతడి ఇంట్లో అనుకోని అతిధిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఊహించని విధంగా జరగడంతో ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది.

తెల్లవారు జామున నిద్రలేవగానే తన ఇంట్లో అలికిడి అయినా శబ్దం విని వచ్చి చూసి అక్కడ మొసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యాడు.అది భారీ మొసలి కావడంతో ఆ యజమాని వెంటనే తేరుకుని బయటకు వచ్చి తలుపులు మూసేసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

అసలు ఏం జరిగిందంటే.శ్రీలంక లోని అనురాధ పురములో ఉంటున్న ఒక ఇంట్లో ఊహించని విధంగా మొసలి రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగారు పడడంతో పాటు ఆ మొసలిని చూసి చాలా భయపడ్డారు.

ఆ ఇంటి యజమాని తెల్లవారు జామున ఇంట్లో ఏదో శబ్దం వినిపించి తన గదిలో నుండి బయటకు వచ్చి చూసాడు.బయటకు వచ్చి కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Advertisement

బయటకు వచ్చి పెద్ద ఆరు అడుగుల మొసలిని అతడు తన ఇంట్లో చూడగానే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది.కానీ తన తెలివి ప్రదర్శించి వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించాడు.మొసలి ని చూసి ఖంగారు పడకుండా అది పారి పోకుండా బయటకు వచ్చి తలుపులు వేసాడు.

వెంటనే అటవీ సిబ్బందికి తన ఇంట్లో మొసలి ఉందని సమాచారం అందించాడు.హుటాహుటిగా అటవీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.కానీ అక్కడికి వచ్చిన సిబ్బంది కి ఆ మొసలి చుక్కలు చూపించింది.

దానిని పట్టుకోవడానికి శత విధాల ప్రయత్నించారు.ఎంత ప్రయత్నించినా అది ఎటూ కదల కుండా అక్కడే ఉండడంతో కొద్దీ సేపు కష్టపడ్డారు.

దాని మేడలో తాడు వేసి చివరకు జాగ్రత్తగా పట్టుకున్నారు.దీంతో ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు