నా నెంబర్ ప్లేట్ ఎలా ఉపయోగిస్తారు.. విక్కీ కౌశల్ సినిమాపై కేసు?

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం లుకా చుప్పి 2.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఒక వీడియో క్లిప్ బయటకు రావడంతో ఈ వీడియో పై ఓ నెటిజన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిత్ర బృందంపై పోలీస్ కేస్ వేశారు.అసలు పోలీస్ కేసు వేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

లుకా చుప్పి 2 సినిమాకి సంబంధించిన ఈ వీడియోలో విక్కీ కౌశల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ను బండి పై కూర్చోబెట్టుకుని వెళ్తుంటారు.అయితే ఈ బండి నెంబర్ ప్లేట్ తమదేనంటూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జై సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిత్ర బృందం పై పోలీస్ కేసు పెట్టారు.

తన అనుమతి లేకుండా ఈ విధంగా చిత్ర బృందం తన బండి నెంబరు ఉపయోగించడం చట్టరీత్యా నేరం.

Advertisement

మరి ఈ విషయం చిత్ర బృందానికి తెలిసి ఉపయోగించారా లేక తెలియక ఉపయోగించారా అనే విషయం తనకు తెలియదని ఈ సందర్భంగా జై సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు.మరి ఈ విషయంపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించలేదు.మరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు