దోస సాగులో డౌనీ బూజు తెగులను అరికట్టే పద్ధతులు..!

పంట పొలంలో తేమ వాతావరణం( Moisture ) అధికంగా ఉన్నప్పుడు ఈ బూజు తెగులు( Powdery Mildew ) వ్యాపించే అవకాశం ఉంటుంది.

ఎప్పుడు పంట పొలంలో సూర్యరశ్మి, గాలి బాగా తగిలేటట్టు మొక్కలను దూరంగా నాటుకోవాలి.

ఉష్ణోగ్రత 15 నుంచి 23 డిగ్రీల మధ్య ఉంటే పంటకు బూజు తెగులు కచ్చితంగా వ్యాపిస్తుంది.తర్వాత ఆకుల అడుగు భాగంలో సహజ రంధ్రాలు ఏర్పడి కణజాలాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి.

దోస మొక్క ఆకులపై( Cucumber ) ముందుగా పసుపు రంగు చుక్కలు ఏర్పడి, అడుగు భాగంలో బూడిద రంగు ఏర్పడుతుంది.ఈ తెగులు సోకిన మొక్కలలో లేత చిగురులు, పూత, పిందె వాడిపోయి చనిపోతాయి.

మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉండదు.

Advertisement

బూజు తెగులు రాకుండా ముందుగా వ్యాధి నిరోధకతను తట్టుకుని విత్తనాలను ఎంచుకొని దాటుకోవాలి.మొక్కల మధ్య సూర్యరశ్మి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా నాటుకుంటే ఈ తెగులను రాకుండా అరికట్టవచ్చు.ఇక నీటి తడులు కేవలం పగటిపూట మాత్రమే అందించాలి.

పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.దోస మొక్కల తీగలు నేలకు తగలకుండా పందిరి కట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

పొలంలో ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి.

పంట చేతికి వచ్చిన అనంతరం పంట అవశేషాలను పొలం నుండి పూర్తిగా తొలగించాలి.పొలంలో ఉపయోగించడానికి ముందే పనిముట్లను శుభ్రంగా కడిగి ఉపయోగించాలి.కలుషితమైన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేసి నాశనం చేయాలి.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వైరల్ వీడియో : చిల్లరిచి ఐఫోన్ కొన్న బిచ్చగాడు

పంట పొలంలో ఈ బూజు తెగులను గుర్తించి వెంటనే మాంకోజెబ్ లేదా క్లోరోతలొనిల్ అనే రసాయన పిచికారి మందులను ఉపయోగించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.ఒకవేళ ఈ తెగుల వ్యాప్తి అధికంగా ఉంటే ప్లూపిక్లోరైడ్ లేదా మొఫెనోక్సానిల్ లలో ఏదో ఒక రసాయన పిచికారి మందును నీటిలో కలిపి మొక్కల ఆకులు, కొమ్మలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Advertisement

తాజా వార్తలు