రెండు స్పూన్ల అవిసె గింజలతో చిట్లిన జుట్టును ఈజీగా రిపేర్ చేయవచ్చు.. ఎలాగంటే?

సాధారణంగా కొందరి జుట్టు తరచూ చిట్లిపోతూ ఉంటుంది.

పోషకాహార లోపం, ఎండలు ప్రభావం, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా ఉపయోగించడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

చాలామంది చిట్లిన జుట్టును కత్తిరించుకుంటూ పోతారు.కానీ కత్తిరించడమే పరిష్కారం కాదు.

జుట్టు చిట్లడాన్ని ఆపాలి.అందుకు అవిసె గింజలు అద్భుతంగా సహాయపడతాయి.

అవిసె గింజల్లో ఉండే పలు పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చిట్లిన జుట్టును రిపేర్ చేస్తాయి.

Advertisement

మరి ఇంతకీ అవిసె గింజలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) వన్ టేబుల్ స్పూన్ మెంతులు ( Fenugreek )వేసి ఉడికించాలి.దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్లీ స్ట్రక్చర్ లో ఉన్న వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్లీ వాట‌ర్‌ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

మళ్లీ మళ్లీ చిట్లడం, విరగడం వంటివి కంట్రోల్ అవుతాయి.కురులు సిల్కీగా, షైనీ గా మారతాయి.

Advertisement

హెయిర్ ఫాల్ సమస్య( Hair fall problem ) దూరం అవుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు