స‌మ్మ‌ర్‌లో బాడీ హీట్‌ను దూరం చేసే గు‌మ్మ‌డి..ఎలా తీసుకోవాలంటే?

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.రోజురోజుకు ఎండలు దంచికొడుతున్నాయి.

మధ్యాహ్నం కాదు.

ఉద‌యం నుంచే భానుడు భ‌గ భ‌గ మంటూ మంట పుట్టిస్తుండ‌డంతో.

బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు.ఇక ఈ వేస‌వి కాలంలో ఎండ‌ల దెబ్బ‌కు బాడీ హీట్ పెరిగిపోతుంటుంది.

ఈ హీట్‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చుకోవాలో తెలియ‌క చాలా మంది తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే హీట్‌ను త‌గ్గించి బాడీని కూల్ చేయ‌డంలో కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.వేడిని త‌గ్గించి శ‌రీరానికి చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో గుమ్మ‌డి కాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

సాధార‌ణంగా గుమ్మ‌డితో కూర‌లు, వ‌డియాలు పెడుతుంటారు.గుమ్మ‌డితో ఏం చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.

రుచిలోనే కాదు పోష‌కాలు కూడా గుమ్మ‌డిలో ఎక్కువే.అందుకే ఆరోగ్యానికి గుమ్మ‌డి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా స‌మ్మ‌ర్‌లో గుమ్మ‌డితో జ్యూస్ త‌యారు చేసుకుని తీసుకుంటే.శ‌రీరంలో ఉన్న అధిక వేడి పోగొట్టి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కూల్‌గా మార్చుతుంది.

Advertisement

అలాగే బాడీ హీట్‌కు చెక్ పెట్ట‌డంలో పెస‌ర ప‌ప్పు కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.పెస‌ర ‌ప‌ప్పులో బోలెడ‌న్ని పోష‌కాల‌తో పాటు శ‌రీర వేడిని చ‌ల్లార్చే గుణాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి.అందువ‌ల్ల, ఈ స‌మ్మ‌ర్‌లో త‌ర‌చూ పెస‌ర ప‌ప్పును ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది.

ముఖ్యంగా పెర‌స ప‌ప్పు జావ‌, పెర‌స ప‌ప్పు కూర ఇలాంటివి తీసుకోవాలి.ఇక గ‌స‌గ‌సాలు కూడా శ‌రీర వేడిని నీవారించ‌గ‌లవు.కొన్ని గ‌స‌గ‌సాల‌ను నీటిలో క‌లిపి తీసుకోవాలి.

ఇలా స‌మ్మ‌ర్‌లో చేయ‌డం వ‌ల్ల హీట్ త‌గ్గి బాడీ కూల్‌గా మారుతుంది.అయితే మంచిది క‌దా అని గ‌స‌గ‌సాల‌ను అతిగా మాత్రం తీసుకోరాదు.

వీటిని ఓవ‌ర్‌గా తీసుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.కాబ‌ట్టీ, ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

తాజా వార్తలు