డ్రై స్కిన్‌కి చెక్ పెట్టే మాయిశ్చరైజర్‌ని ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

ఆయిలీ స్కిన్ వారే కాదు డ్రై స్కిన్ వారు సైతం ఎన్నో ఇబ్బందులు ప‌డుతుంటారు.

ముఖ్యంగా ప్ర‌స్తుత చ‌లి కాలంలో పొడి చ‌ర్మ త‌త్వం క‌లిగి ఉన్న వారి బాధ వ‌ర్ణ‌ణాతీతమ‌నే చెప్పాలి.

మార్కెట్‌లో దొరికే ఖ‌రీదైన మాయిశ్చ‌రైజ‌ర్ల‌ను కొనుగోలు చేసి వాడినా మ‌ళ్లీ కొద్ది సేప‌టికే చ‌ర్మం పొడి బారి పోయి మంట పుట్టేస్తుంటుంది.దాంతో ఏం చేయాలో తెలీక‌.

అస‌లు డ్రై స్కిన్‌ను ఎలా నివారించుకోవాలో అర్థంగాక స‌మమ‌తమైపోతుంటారు.ఈ క్ర‌మంలోనే చ‌ర్మం కోసం ఎన్నెన్నో డ‌బ్బులు త‌గ‌లేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ అండ్ ఎఫెక్టివ్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను వాడితే గ‌నుక డ్రై స్కిన్‌కి సుల‌భంగా చెక్ పెట్ట వ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పొడి చ‌ర్మాన్ని దూరం చేసే మాయిశ్చ‌రైజ‌ర్‌ని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో ఐదు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్‌, నాలుగు చుక్క‌లు టీ ట్రీ ఎసెన్షియ‌ల్ ఆయిల్‌, నాలుగు చుక్క‌లు రోజ్ ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ వేసి ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మాయిశ్చ‌రైజ‌ర్ సిద్ధ‌మైన‌ట్టే.

న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను ఒక బాక్స్‌లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ప్ర‌తి రోజు ఈ మాయిశ్చ‌రైజ‌ర్‌ను వాడితే గ‌నుక చ‌ర్మం ఎక్కువ స‌మ‌యం పాటు తేమ‌గా, నిగారింపుగా ఉంటుంది.ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు ఉన్న వారు రెగ్యుల‌ర్‌గా ఈ మాయిశ్చ‌రైజ‌ర్‌ను యూజ్ చేయాలి.త‌ద్వారా ఆయా స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

అంతే కాదు, ఈ మాయిశ్చ‌రైజ‌ర్‌ను వాడ‌టం వ‌ల్ల‌ స్కిన్ కాంతి వంతంగా కూడా మెరుస్తుంది.ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబ‌ట్టి ఖ‌చ్చితంగా పైన చెప్పిన మాయిశ్చ‌రైజ‌ర్‌ను త‌యారు చేసుకుని వాడేందుకు ప్ర‌య‌త్నించండి.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు