కేవలం వారం రోజుల్లోనే బరువు తగ్గాలా ? అయితే డైట్‌ ప్లాన్‌ ఇదిగో.!  

How To Lose Weight In Just One Week - Telugu Banana And Milk, Boiled Vegetables, Diet Plan, Health Tips, , Keera And Watermelon, Lose Weight, Loss Weight In One Week, One Week, Telugu Health, Weight Loss Tips

నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో ఒకటి.అధిక బరువు.

How To Lose Weight In Just One Week

దీంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు.ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు.

నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు.పలు రకాల డైట్‌లను ఫాలో అవుతున్నారు.

కేవలం వారం రోజుల్లోనే బరువు తగ్గాలా అయితే డైట్‌ ప్లాన్‌ ఇదిగో.-Telugu Health-Telugu Tollywood Photo Image

క్యాలరీలు తక్కువగా వచ్చే ఆహారాన్ని మాత్రమే తింటున్నారు.అయినప్పటికీ కొందరు బరువు తగ్గలేకపోతున్నారు.

అయితే అలాంటి వారు కింద చెప్పిన ఈ కొత్త తరహా డైట్‌ ప్లాన్‌ను పాటిస్తే దాంతో అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు.అవును, మీరు విన్నది నిజమే.

ఈ డైట్‌ ప్లాన్‌ కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఉంటుంది.ఈ వారం రోజుల పాటు రోజూ కింద చెప్పిన విధంగా నిర్దిష్టమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.

దీంతో కచ్చితంగా బరువు తగ్గుతారు.వారం పాటు ఈ డైట్‌ను పాటించి చూశాక మీ శరీర బరువులో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు.

అవును, మీరు విన్నది కరెక్టే.మరి వారం రోజుల పాటు మీరు పాటించాల్సిన ఆ డైట్‌ ప్లాన్‌ ఏమిటో, రోజూ ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందామా.!

మొదటి రోజు…


మొదటి రోజు కేవలం కీరదోస, పుచ్చకాయలను మాత్రమే తినాలి.ఎన్ని వీలైతే అన్ని తినవచ్చు.

కానీ కేవలం ఈ రెండు ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.ఇక నీటిని యథావిధిగా తాగాలి.

రెండో రోజు…


ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడకబెట్టిన ఆలుగడ్డ తినాలి.మధ్యాహ్నం ఉడికించిన కూరగాయాలను తినాలి.రాత్రికి వీటినే కంటిన్యూ చేయాలి.

మూడో రోజు…


మూడో రోజున అరటిపండు, ఆలుగడ్డ తినరాదు.ఇవి తప్ప మిగిలిన అన్ని పండ్లు, కూరగాయలను తినవచ్చు.నియంత్రణ కూడా ఏమీ లేదు.

నాలుగో రోజు…


8 అరటి పండ్లు తినాలి.అలాగే 3 గ్లాసుల పాలు మాత్రమే తాగాలి.

పరిధి దాటరాదు.

ఐదో రోజు…


2 కప్పుల అన్నం, 6 టమాటాలను తీసుకోవాలి.టమాటాలను ఉడకబెట్టుకుని తినాలి.

ఆరవ రోజు…


ఒక కప్పు అన్నం, కూరగాయలను తినాలి.కూరగాయలను ఉడకబెట్టుకుని తినాలి.

ఏడో రోజు…

ఒక కప్పు అన్నం, పండ్ల రసం తీసుకోవాలి.
అంతే.పైన చెప్పిన విధంగా ఒక వారం పాటు డైట్‌ తీసుకుని చూడండి.దీంతో మీ శరీర బరువులో కచ్చితంగా మార్పు కనిపిస్తుంది.వారం తరువాత బరువు తగ్గినట్టు అనిపిస్తే ఒక రెండు మూడు రోజులు ఆగాక మళ్లీ ఇదే రిపీట్‌ చేయవచ్చు.

ఇలా మీరు కావల్సిన బరువు తగ్గేవరకు ఈ డైట్‌ ప్లాన్‌ పాటించవచ్చు.కనుక ఇంకెందుకాలస్యం.

బరువు తగ్గాలనుకునే వారు వెంటనే ఈ డైట్‌ ప్లాన్‌ను ఆచరించండి మరి.!

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How To Lose Weight In Just One Week Related Telugu News,Photos/Pics,Images..

footer-test