ఇంట్లోనే ఓ గదిలో కుంకుమ పువ్వును పండించే విధానం..!

వ్యవసాయ రంగంలో సరికొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చి పంటల సాగు విధానాన్ని సులభతరం చేస్తున్నాయి.పంటలు పొలాల్లోనే కాదు ఇళ్లల్లో కూడా సాగు చేయవచ్చు.

కుంకుమ పువ్వును ( Saffron flower )ఇంట్లో ఓ గదిలో సాగు చేసి అధిక దిగుబడి పొంది అధిక లాభాలు అర్జించవచ్చు.అది ఎలాగో తెలుసుకుందాం.

ఇంట్లో 12*12 అడుగుల విస్తీర్ణం ఉండే గదిలో ఇనుప ర్యాక్ లలో ఫైబర్ టబ్ లు అమర్చి, కృత్రిమ వెలుతురు సదుపాయాలను గదిలో సమకూర్చి కుంకుమ పువ్వు పంటను సాగు చేయవచ్చు.

గదిలో గాలి తేమశాతం 80 శాతం ఉండేలా చూసుకోవాలి.రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉండేటట్లు చూసుకోవాలి.గదిలో ఒక చిల్లింగ్ యంత్రాన్ని, హ్యూమిడిఫయర్( Chilling machine, humidifier ) ను ఏర్పాటు చేయాలి.

Advertisement

గదిలో 20 వరకు గ్రో లైట్లు ఏర్పాటు చేయాలి.ఈ లైట్లు ఉదయం 8 నుంచి సాయంత్రం ఐదు వరకు వెలుగుతూనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పగటిపూట గదిలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల వరకు ఉండవచ్చు.నవంబర్ లేదా డిసెంబర్ లో మట్టి మిశ్రమంలో లేదా ట్రేలలో కుంకుమ పువ్వును నాటుకొని వారం లేదా పది రోజులకు ఒకసారి మొక్కలపై నీటిని పిచికారి చేయాలి.

లేదంటే మట్టి లేకుండా కూడా కుంకుమ పువ్వు సాగు చేయవచ్చు.

గాలిలో తేమశాతం 80 ఉంటుంది కాబట్టి చల్లని వాతావరణం లో మొక్క బాగా పెరుగుతుంది.మొక్క 45 రోజుల్లో పూతకు వస్తుంది.విత్తన దుంపలు ఏడు గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉంటే మంచిది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
సెనేట్ ఆమోదం లేకుండానే కేబినెట్ నియామకాలు.. ట్రంప్ వ్యూహాత్మక ఎత్తుగడ

మొక్కలకు అందించాల్సిన ఎరువుల విషయానికి వస్తే నానో యూరియా( Nano urea ) లేదా ఎన్పికె ను నెలకు ఒకసారి పిచికారి చేస్తే సరిపోతుంది.ఏప్రిల్ నుంచి జూన్ వరకు దుంపలు నిద్రవస్థలో ఉంటాయి.

Advertisement

జూలై నెలలో ఏడు గ్రాముల కంటే బరువుగా ఉండే దుంపలను వేరుచేసి మట్టి మిశ్రమంలో నాటుకొని కుంకుమపువ్వును సాగు చేయవచ్చు.లేదంటే మట్టిలో కాకుండా విత్తన దుంపలను ట్రేలలో పెట్టుకుని ఏరోపోనిక్స్ పద్ధతిలో కూడా సాగు చేసుకోవచ్చు.

ఈ పంటను సాగు చేస్తే మొదటి సంవత్సరం వచ్చే దిగుబడి పెట్టుబడి కి సరిపోతుంది.రెండవ సంవత్సరం నుంచి దాదాపుగా మూడు లేదా నాలుగు సంవత్సరాల వరకు ఆదాయం పొందవచ్చు.

తాజా వార్తలు