ఇంటి ఆవరణలో పుట్టగొడుగుల పెంపకం చేసే విధానం..!

ప్రస్తుతం చాలామంది ఇంటి ఆవరణలో రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

కొంతమంది స్వయం ఉపాధి కోసం కూడా ఇంటి ఆవరణలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు.

ఇందులో పుట్టగొడుగుల పెంపకం( Mushrooms ) తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందిస్తోంది.పుట్ట గొడుగులు అనేవి శిలీంద్రాల ద్వారా ఉత్పత్తి చేయబడే పునరుత్పత్తి నిర్మాణాలు.

మొక్కలను పెంచడం కంటే పుట్టగొడుగులను పెంచడం కాస్త భిన్నంగా ఉంటుంది.కానీ కొంతమందికి ఇంటి ఆవరణలో పుట్టగొడుగులు పెంచడం సాధ్యమేనా అనే అనుమానం రావచ్చు.

కొంతమంది ఈ పొట్టు గొడుగుల పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

Advertisement

పుట్ట గొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు.కేవలం సేంద్రీయ పదార్థాలతో పుట్టగొడుగుల పోషణ చేయవచ్చు.పుట్టగొడుగులు బీజాంశం ద్వారా పెరుగుతాయి.

తేమతో( Moisture ) కూడిన వాతావరణ పరిస్థితుల మధ్య బాగా జీవించగలుగుతాయి.ఇంటి ఆవరణలో( home ) ఈ పుట్టగొడుగులు పెంచాలి అనుకుంటే వరిగడ్డిని సబ్ స్ట్రెట్ గా ఉపయోగించుకోవచ్చు.

ఒకవేళ ప్లాస్టిక్ బకెట్లో( Plastic Bucket ) ఈ కుల పెంపకం చేయాలి అనుకుంటే బకెట్ కు 2-5 గ్యాలన్ లను ఎంచుకొని రంద్రాలు పెట్టుకోవాలి.ద్వారా పుట్టగొడుగులు పెరిగి బయటకు వస్తాయి.

పరాన్న జీవుల నుండి ఈ పుట్టగొడుగులను రక్షించడం కోసం అందులో క్రిమిహారక మందులు చల్లుకోవాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
టమాటా నారు పెంపకంలో పాటించాల్సిన సరైన యాజమాన్య పద్ధతులు..!

బకెట్ లోపల వరిగడ్డి మరియు స్పాన్ పుట్టగొడుగుల గింజలు వేయడం వల్ల తడి లేకుండా తేమ వచ్చే వరకు నీటిని పోయడం ద్వారా సబ్ స్ట్రేట్ ను తేమ చేస్తుంది.ఓస్టేర్ మష్రూమ్ కు ప్రాధాన్యత ఇస్తే రెండు వారాల్లో ఈ రకం కోతకు సిద్ధంగా ఉంటుంది.బకెట్ ను సూర్యరశ్మి( Sunlight ) లేని తేమతో కూడిన ప్రదేశంలో ఉంచాలి.

Advertisement

ఇక సుమారుగా 14 నుంచి 15 రోజుల మధ్యలో పుట్టగొడుగులు కోయవచ్చు.పుట్టగొడుగుల పెంపకం అనేది ఇండోర్ సాగు, కాంతి అవసరం ఉండదు.

ఇంట్లో పుట్టగొడుగుల పెంపకం చేసే వారికి ప్రభుత్వం కూడా మదర్ స్పాన్ ను ఉచితంగానే ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది.

తాజా వార్తలు