స్నానం చేసే ముందు ఒంటికి ఇవి ప‌ట్టిస్తే మృదువుగా మెరిసిపోతుంద‌ట‌!

ముఖ‌మే కాదు శ‌రీరం మొత్తం మృదువుగా, కాంతివంతంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, అందు కోసం ఏం చేయాలో తెలియ‌క‌.

మార్కెట్‌లో లభ్యమయ్యే మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్లు అప్లై చేసి ఊరుకుంటారు.కానీ, ప్ర‌తి రోజు స్నానం చేసే ముందు ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ టిప్స్ ను పాటిస్తే.

చ‌ర్మం య‌వ్వ‌నంగా, మృదువుగా మ‌రియు అందంగా మెరిసి పోతుంద‌ట‌.మ‌రి ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఆ సూప‌ర్ న్యాచుర‌ల్ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.

ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల‌ ఆముదం, ప‌ది స్పూన్ల‌ కొబ్బ‌రి నూనె మ‌రియు మూడు స్పూన్ల క‌ల‌బంద జెల్ వేసుకుని బాగా క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒంటికి మొత్తం ప‌ట్టించి బాగా మ‌సాజ్ చేసుకోవాలి.

Advertisement

స్నానం చేయ‌డానికి అర గంట ముందు ఇలా చేసి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో బాత్ చేయాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉంటుంది.మ‌రియు స్కిన్ ఎల్ల‌ప్పుడూ స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మెరిసి పోతుంది.

అలాగే ఒక గిన్నెలో ఏడు లేదా ఎనిమిది స్పూన్ల పెసర‌ పిండి, అర స్పూన్ క‌స్తూరి ప‌సుపు, స‌రిప‌డా నువ్వుల నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒంటికి ప‌ట్టించి.కాస్త డ్రై అయిన త‌ర్వాత మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ శుభ్రం చేసుకోవాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి.త‌ద్వారా దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పోయి.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

చ‌ర్మం తాజాగా, ఆరోగ్యంగా మారుతుంది.ఇక ఒక బౌల్ తీసుకుని అందులో అర క‌ప్పు ఆలివ్ వేసి లైట్ హీట్ చేయాలి.

Advertisement

ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్ల తేనె యాడ్ చేసి మిక్స్ చేయాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని శ‌రీరం మొత్తానికి ప‌ట్టించి.

అర గంట త‌ర్వాత బాత్ చేయాలి.ఇలా రోజూ చేస్తే చ‌ర్మం ఎప్పుడూ మృదువుగా, నిగారింపుగా ఉంటుంది.

తాజా వార్తలు