అలసటను దూరం చేసే గంజి.. రోజు ఇలా తీసుకుంటే మరెన్నో లాభాలు?

వయసు పైబడే కొద్ది ఒంట్లో శక్తి తగ్గుతుంది.దీని కారణంగా తరచూ అలసటకు గురవుతుంటారు.

కొంచెం పని చేసినా కూడా అలసట వేధిస్తూ ఉంటుంది.అయితే ఎంత తీవ్రమైన అలసటను అయినా సరే దూరం చేసే సామర్థ్యం గంజికి ఉంది.

సాధారణంగా అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని బయట పారబోసేస్తుంటారు.కానీ గంజిలో ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.

ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి గంజి( Porridge ) అండగా నిలుస్తుందిఒక కప్పు గంజిలో రెండు టేబుల్ నిమ్మరసం, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకుని బాగా కలిపి సేవించాలి.ఈ విధంగా రోజు కనుక తీసుకుంటే అలసట, నీరసం వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

గంజి ఎలక్ట్రోలైట్స్‌ ను సమన్వయం చేసి.శరీరాన్ని చురుగ్గా మారుస్తుంది.

అలాగే గంజిని రోజు తీసుకోవడం వ‌ల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

నెలసరి సమయంలో నొప్పుల కారణంగా ఆడవారు ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.ముఖ్యంగా కడుపు నొప్పి,( Stomach ache ) నడుము నొప్పి, కాళ్లు లాగేయడం వంటివి ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి.వాటిని తట్టుకోలేక పెయిన్‌ కిల్లర్స్ ను మింగుతుంటారు.

అయితే ఇకపై గంజిని తీసుకునేందుకు ప్రయత్నించండి.నెలసరి నొప్పులను నివారించడానికి గంజి ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

గంజిని తీసుకొంటే నొప్పులతో పాటు ఒత్తిడి దూరం అవుతుంది.భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.

Advertisement

అలాగే తరచూ గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం( Gas acidity constipation ) వంటి సమస్యలతో బాధపడేవారు గంజిని తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే గంజి జీర్ణక్రియ పనితీరును పెంచుతుంది.జీర్ణ సంబంధిత సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.

గంజిని నిత్యం తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇక గంజి ద్వారా ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి వంటి ఎన్నో విలువైన పోషకాలను సైతం పొందవచ్చు.

తాజా వార్తలు