నోటి పూతతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ ఎఫెక్టివ్ టిప్స్ మీ కోస‌మే!

నోటి పూత లేదా మౌత్ అల్సర్.ఈ స‌మ‌స్య దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఎదుర్కొనే ఉంటారు.

ఇది చిన్న స‌మ‌స్య అయిన‌ప్ప‌టికీ.చాలా ఇబ్బందిగా, భ‌రించ‌లేనంత నొప్పిగా ఉంటుంది.

ఒక్కోసారి ఆహారం తీసుకోవడం కష్టతరంగా ఉంటుంది.ఈ స‌మ‌స్య కొందరిలో తరచుగా వ‌స్తే.

కొందరిలో అప్పుడప్పుడు వ‌స్తుంటుంది. నోటి అపరిశుభ్రత, ధూమపానం, మద్యపానం అలవాట్లు, పేగు సంబంధిత సమస్యలు ఉన్న‌ప్పుడు, విట‌మిన్ల లోపం వ‌ల్ల నోటి పూత వ‌స్తుంటుంది.

Advertisement

ఇక నోటి త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల మందులు, మౌత్ వాష్‌లు వాడుతుంటారు.అయితే చిన్న చిన్న టిప్స్‌ పాటించి కూడా నోటి పూత‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.నోటి పూత స‌మ‌స్య ఉన్న వారు తులిసి ఆకుల‌ను మూడు లేదా నాలుగు తీసుకుని.

బాగా న‌మిలి తినాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల నోటి పూత క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

ఉప్పు నీరు కూడా నోటి పూత‌ను త‌గ్గించ‌గ‌ల‌దు.అందుకే ఒక గ్లాస్ వాట‌ర్‌లో ఒక స్పూన్ ఉప్పు క‌లిసి.నీటితో పుక్కిలించాలి.అనంత‌రం మామూలు నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇలా చేయ‌డం వ‌ల్ల కాస్త మంట‌గా, నొప్పిగా ఉంటుంది.కానీ, నోటీ పూత త్వ‌రగా త‌గ్గిపోతుంది.

Advertisement

స్వ‌చ్ఛ‌మైన తేనె సైతం నోటి పూత‌ను త‌గ్గించ‌గ‌ల‌దు.నోటి పూసిన వారు.

కొద్దిగా తేనె తీసుకుని పుండ్లుగా ఉన్న భాగంలో అప్లై చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల నొప్పి నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో పాటు.

క్ర‌మంలో స‌మ‌స్య కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.అలాగే ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తీసుకోవాలి.

ఎందుకంటే.శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా నోటి పూత ఏర్ప‌డుతుంది.

అయితే నీరు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి.ఇక నోటి పూతతో బాధ‌ప‌డుతున్న‌వారు పెరుగు, గుడ్డు, పాలు ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

అప్పుడే శారీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విట‌మిన్లు అంది.నోటి పూత త‌గ్గుతుంది.

తాజా వార్తలు