దానిమ్మ‌తో ఫేషియ‌ల్.. ఒక్క‌సారి చేసుకుంటే చాలు మ‌స్తు బెనిఫిట్స్‌!

ప్ర‌త్యేక‌మైన రుచిని క‌లిగి ఉండే దానిమ్మ పండును దాదాపు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.అలాగే ఆరోగ్యానికీ దానిమ్మ ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

మ‌రియు అనేక జ‌బ్బుల నుంచి విముక్తిని క‌లిగిస్తుంది.ఇక చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలోనూ దానిమ్మ‌కు సాటే లేదు.

ముఖ్యంగా దానిమ్మ‌తో ఇంట్లోనే ఇప్పుడు చెప్పే విధంగా ఫేషియ‌ల్ చేసుకుంటే.మ‌స్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు దానిమ్మ‌తో ఫేషియ‌ల్ ఎలా చేసుకోవాలో చూసేయండి.ముందు ఒక దానిమ్మ పండు నుంచి గింజ‌ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

Advertisement

ఆపై జ్యూస్‌ను, ప‌ల్ప్‌ను వేరు చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఏం చేయాలంటే.

స్టెప్ -1:

ఒక బౌల్‌లో రెండు స్పూన్ల దానిమ్మ ర‌సం, అర స్పూన్ రోజ్ వాట‌ర్ మ‌రియు అర స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి రెండు నుంచి మూడు నిమిషాల పాటు క్లిన్స్ చేసి.గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాస్ చేసుకోవాలి.

స్టెప్‌-2:

ఒక బౌల్‌లో తీసుకుని అందులో ముందుగా వేరు చేసుకుని పెట్టుకున్న‌ దానిమ్మ ప‌ల్ప్ రెండు స్పూన్లు, అర స్పూన్ ఓట్స్ పౌడ‌ర్‌, రెండు స్పూన్ల తేనె వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి స్మూత్‌గా రెండు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకుని.

ఆపై వాట‌ర్‌తో శుభ్ర‌ప‌రుచుకోవాలి.

స్టెప్‌-3:

బౌల్‌లో ఒక స్పూన్ దానిమ్మ ర‌సం, ఒక స్పూన్ అలోవెర జెల్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి.అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు పూసి క‌నీసం ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకుని.అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

స్టెప్‌-4:

బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఎర్ర కంది ప‌ప్పు పొడి, ఒక స్పూన్ శెన‌గ పిండి, అర స్పూన్ పెరుగు, చిటికెడు క‌స్తూరి ప‌సుపు మ‌రియు స‌రిప‌డా దానిమ్మ ర‌సం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి.పావు గంట త‌ర్వాత ఫేస్ వాష్‌ చేసుకోవాలి.

Advertisement

వారంలో ఒకే ఒక్క‌సారి ఆ నాలుగు స్టెప్స్‌ను పాలో అయితే.స్కిన్ టోన్ పెరుగుతుంది.

మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.ముఖం మృదువుగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.

తాజా వార్తలు