ఇంత అందంగా ఉంటే మేము ఎలా బతకాలి.. ఇస్మార్ట్ బ్యూటీకి హాట్ హాట్ ప్రశ్నలు?

సినిమాపై ఉన్న మక్కువతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో మున్నా మైఖేల్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

2018 చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సవ్యసాచి చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు మొదటి సినిమా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.అలాగే 2019 వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా కూడా నిరాశ పరిచిన ప్పటికీ అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.రామ్ పోతినేని హీరోగా తెరకక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ తన అందాల నిధి బయటపెడుతూ కుర్రకారు మనసు దోచింది అని చెప్పవచ్చు.

ఈ సినిమా విజయవంతమైన తరువాత ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాగా బిజీ అయింది.ఎంతగా అంటే ఏకంగా కోలీవుడ్ ప్రేక్షకులు ఈమెకు పాలాభిషేకాలు నిర్వహించే అంతగా గుర్తింపు సంపాదించుకుంది.

Advertisement

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఇలా వరుస తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే నిత్యం తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అందమైన ఫోటోని షేర్ చేశారు.

ఈ క్రమంలో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారి ఎంతో మంది కుర్రాళ్లను ఆకట్టుకుంది.ఇకపోతే ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ నలుపు రంగు చీర కట్టుకుని ఎంతో అందంగా, అమాయకంగా చూస్తూ ఉన్న ఫోటోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

ఇక ఈ ఫోటో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ స్పందిస్తూ.మరి మీరు ఇంత అందంగా ఉంటే మేము ఎలా బ్రతకాలి అంటూ ఇస్మార్ట్ బ్యూటీ అందంపై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

అలాగే అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా ఏకంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు