సుశాంత్ మృతి కేసులో నిందితులుగా ఎంతమంది అంటే.. ?

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం చార్జి షీట్‌ ను దాఖ‌లు చేసింది.

కాగా ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్‌సీబీ అధికారులు 34 మందిని అరెస్ట్ చేయగా సుమారుగా 200 మంది సాక్షుల‌ను విచారించారు.

ఈమేరకు డిజిట‌ల్ ఫార్మాట్‌ లో చార్జి షీట్ సుమారు 50 వేల పేజీల వరకు తయారు చేశారు.ఇకపోతే సుశాంత్ మృతితో పాటుగా డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉన్న సుమారు 12 వేల పేజీల చార్జి షీట్‌ను ప్ర‌త్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో స‌మ‌ర్పించింది.

కాగా ఆ చార్జిషీట్ లో సుశాంత్ స్నేహితురాలు రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు మ‌రో 32 మంది నిందితులను చేర్చింది.ఇక చార్జి షీట్‌ను ఎన్‌సీబీ చీఫ్ స‌మీర్ వాంఖ‌డే కోర్టుకు స‌మ‌ర్పించారు.

ఇకపోతే ఈ కేసుతో సంబంధం ఉన్న సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిని గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌ లో అరెస్ట్ చేశారు.రియా సోద‌రుడు శౌవిక్ ‌ను కూడా అరెస్టు చేసి ఆ త‌ర్వాత బెయిల్‌ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

తాజా వార్తలు