టైటానిక్‌ షిప్ దగ్గరకి జేమ్స్ కామెరూన్ అన్నిసార్లు ఎలా వెళ్లగలిగారు?

టైటానిక్( Titanic shi ) శకలాల్ని చూసేందుకు వెళ్లిన సబ్మెరైన్ టైటాన్ గల్లంతైన సంగతి అందరికీ తెలిసినదే.

గత మూడు నాలుగు రోజులుగా అందులోని ఐదుగురు ప్రయాణికులను కాపాడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తాజాగా ఆ ఐదుగురూ చనిపోయినట్టు యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే.ఈ నేపథ్యంలో టైటాన్ గురించిన అనేక విషయాలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.

టైటానిక్ టూర్ అనేది చాలా సాహసంతో కూడుకున్నది.సముద్రంలో దాదాపు 13 వేల అడుగుల లోతుకి వెళ్లి రావడం అంటే అంత తేలికైన విషయం కాదు.

కానీ థ్రిల్ కోసం వెళ్లి కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు కొందరు బడాబాబులు.

Advertisement

ఈ ఐదుగురు కుబేరులు కూడా అలాగే వెళ్లి తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు.అసలు ఇంతగా థ్రిల్ ఫీల్ అయ్యేంత ఏముంటుంది ఈ టూర్లో అన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న? అది అత్యంత ప్రమాదకరమని తెలిసినా బిలియనీర్లు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? 1912లో టైటానిక్ షిప్ మునిగిపోయింది.ఇప్పటికి దాదాపు 111 ఏళ్లు గడిచిపోయాయి.

ఆ ప్రమాదంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.కాగా వాటి శకలాలు ఎక్కడో సముద్ర గర్భంలో చిక్కుకున్నాయి.

వాటిని బయటకు తీయడం అసాధ్యం.అందుకే అక్కడే ఉంచేశారు.

కానీ.కొంతమంది ఔత్సాహికులకు అక్కడికి వెళ్లి దానిని తిలకించి ఏదో మిస్టరీని సాధిద్దామని కోరిక.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

కానీ అదే కోరిక ఇపుడు కొంతమందికి బలిగొంటుంది.

Advertisement

అయితే అంత రిస్క్ అయినటువంటి పయనాన్ని 1997లో డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ( James Cameron )టైటానిక్ సినిమా తీసే భాగంలో ఏకంగా 32 సార్లు చేసాడని ఎవరు వూహించగలరు? కాగా ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే సంచలనమైన సంగతి అందరికీ విదితమే.ఇపుడు చాలామందికి అంతుచిక్కని ప్రశ్న ఏమిటంటే.ఎవ్వరికీ సాధ్యం కానిపని జేమ్స్ కామెరూన్ కి ఎట్టా సాధ్యమైంది అని? సాధారణంగా సముద్ర గర్భంలో 13 వేల అడుగుల లోతు వరకూ వెళ్లే కొలదీ సముద్రంలో ప్రెజర్ ఎక్కువవుతూ ఉంటుంది.ఎక్కువ సేపు అక్కడే ఉంటే ఒత్తిడి తట్టుకోలేక ఏ వస్తువైనా సహజంగా పేలిపోతుంది.

ఇప్పుడు టైటాన్ విషయంలో జరిగింది ఇదే.ఓషన్ గేట్ ఈ టూర్ కోసం ఒక్కొక్కరి నుంచి 2 లక్షల 50 వేల డాలర్లు వసూలు చేస్తుంది.అంటే.

ఇంత డబ్బు ఇచ్చి మరీ చావుని కొని తెచ్చుకున్నారు ఆ ఐదుగురు ప్రయాణికులు.ఇదే సమయంలో జేమ్స్ కామెరూన్ అక్కడికి వెళ్లి మరలా సురక్షితంగా ఎలా వచ్చారా అని?.

తాజా వార్తలు