వైరల్‌ వీడియో : కాకికి ఉన్న కనీసపు జ్ఞానం మనుషులకు లేదాయే

ప్రభుత్వాలు మరియు అధికారులు రోడ్లపై చెత్త వేయవద్దంటూ ఎంతగా మొత్తుకున్నా కూడా చాలా మంది పట్టించుకోకుండా మరీ అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారు.

మరికొందరు పక్కన డస్ట్‌ బిన్‌ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించేందుకు బద్దగిస్తూ ఉంటారు.

రోడ్లపై మనం ఎన్నో రకాల చెత్త చెదారం చూస్తూనే ఉంటాం.ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను పాటించాలంటూ అంతర్జాతీయ సమాజం కూడా డిమాండ్‌ చేస్తుంది.

గ్లోబల్‌ వార్మింగ్‌కు కాలుష్యం ప్రధాన కారణం అనే విషయం తెల్సిందే.

గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.కాని జనాలు నాకేంటి అనే భావనలో ఉంటున్నారు.జనాల్లో ఇంకా పరిశుభ్రతపై అవగాహణ వస్తుందో కాని కాకుల్లో మాత్రం పరిశుభ్రతపై అవగాహణ వచ్చేసినట్లుగా అనిపిస్తుంది.

Advertisement

ఇటీవల ఒక వీడియో సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తుంది.ఆ వీడియోలో ఒక కాకి పారిశుభ్రత విషయంలో మనుషులకు పాఠాలు చెబుతుంది.ఆ కాకిని బుద్ది తెచ్చుకోవాలంటూ జనాలు అజ్ఞాలకు సలహా ఇస్తున్నారు.

కాకులకు ఉన్న నిబద్దత కనీసం మనుషులకు లేకుండా పోయిందే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం జనాలు ఉన్న బిజీ బిజీ షెడ్యూల్‌ కారణంగా పారిశుద్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

ఈకాకి మాత్రం ఒక బాటిల్‌ రోడ్డుపై పడి ఉంటే దాన్ని తీసుకుని వచ్చి డస్ట్‌ బిన్‌లో వేయడం జరిగింది.అయితే ఆ డస్ట్‌బిన్‌లో వేసేందుకు ఆ కాకి చాలానే కష్టపడింది.కష్టం అయినా కూడా ఓపికతో ఆ కాకి డస్ట్‌బిన్‌లో వాటర్‌ బాటిల్‌ వేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇది ఏ దేశంలో జరిగిందో కాని అత్యంత విచిత్రంగా వింతగా అనిపిస్తు అందరిని ఆకట్టుకుంటుంది.ఆ కాకికి ప్రతి ఒక్కరు సెల్యూట్‌ చేస్తుండగా మరికొందరు మాత్రం ఆ కాకికి పారిశుధ్య అవార్డు ఇవ్వాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఆ కాకిని చూసి అయినా ఇకపై జాగ్రత్తలు పాటించాలంటూ కోరుతున్నాం.

Advertisement

తాజా వార్తలు