ట్రంప్‌కు మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దు .. ‘ క్యాపిటల్ ’ ఘటనలో కాంగ్రెస్ ప్యానెల్ సిఫారసులు

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ హౌస్ కమిటీ షాకిచ్చింది.ఆయనకు ఈసారి ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వొద్దని సిఫారసు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూఎస్ క్యాపిటల్ అల్లర్ల ఘటనకు సంబంధించి యూఎస్ కాంగ్రెస్ కమిటీ విచారణ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా 845 పేజీల నివేదికను సమర్పించింది.

క్యాపిటల్ హిల్ ఘటనకు ట్రంపే కారణమంటూ ఆ రిపోర్ట్‌లో పేర్కొంది.తమ విచారణకు మాజీ అధ్యక్షుడు ఏ మాత్రం సహకరించలేదని ప్యానెల్ పేర్కొంది.18 నెలల పాటు సాగిన విచారణలో 1000 మంది సాక్షుల్ని విచారించినట్లు కమిటీ తెలిపింది.ట్రంప్ హయాంలో కీలక హోదాల్లో వున్న అధికారుల్ని కూడా విచారించింది.

తన నివేదికలో హౌస్ కమిటీ 11 సిఫారసులు చేసింది.మరోసారి అధ్యక్ష బరిలో నిలిచేందుకు డొనాల్డ్ ట్రంప్‌కు అవకాశం ఇవ్వరాదని ప్యానెల్ కీలక ప్రతిపాదనలు చేసింది.

Advertisement

ట్రంప్ వల్ల అల్లరి మూకలు రాజధాని వాషింగ్టన్‌లో విధ్వంసం సృష్టించారని.వీటిని అడ్డుకోవాల్సిన అధ్యక్షుడు సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైనట్లు కమిటీ పేర్కొంది.

అలాగే అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చేందుకు అప్పటి ఉపాధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో ట్రంప్ ఒత్తిడి తెచ్చారని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.

కాగా.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2021 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.

ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు భద్రతా దళాలు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.

Advertisement

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది.

గతంలో ఏ అధ్యక్షుడికి రానంత అప్రతిష్టను ట్రంప్ మూట కట్టుకోవాల్సి వచ్చింది.

తాజా వార్తలు