భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం హాస్పిటల్ బెడ్స్.. అసలు కారణం ఏమిటంటే..?

భారతదేశంలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మధ్య జరిగిన ఐపీఎల్( IPL ) మ్యాచ్లను చూస్తే అర్థమవుతుంది.

అలాంటిది ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో భారత్- పాకిస్తాన్( India-Pakistan ) మధ్య జరిగే మ్యాచ్ కు ఎంత విపరీతమైన క్రేజ్ ఏర్పడిందో మాటల్లో చెప్పలేం.గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ కోసం హోటల్ రూమ్స్ అన్నీ బుక్ అయ్యాయి.ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ చార్జీ కేవలం ఒక్క రాత్రికి రూ.1 లక్ష ఉండటం తో ఫ్యాన్స్ నిరాశ చెందకుండా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఓ సరికొత్త ఆలోచనను అమలుపరిచారు.

అహ్మదాబాద్ నగరంలో ఉండే కార్పొరేట్ ఆసుపత్రిలో ఫుల్ బాడీ చెక్ అప్, ఓవర్ నైట్ స్టే బుక్ చేసుకుంటున్నారు.ఇలా బుక్ చేసుకుంటే స్టార్ హోటల్ ఖర్చు కంటే చాలా తక్కువ ధరలోనే రూమ్ పొందవచ్చు.ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకలో, డబ్ల్యూటీసీలో భాగంగా అహ్మదాబాదులో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచులు ఉన్న నేపథ్యంలో భారత జట్టును ఓడిస్తామని పాకిస్తాన్ మాజీ పెసర్ వాకర్ యూనిస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.భారత జట్టును ఓవల్ లో ఓడించిన పాకిస్తాన్ ఎక్కడైనా ఓడిస్తుంది అని వ్యాఖ్యానించాడు.2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానంలో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగితే 180 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలిచింది.ఆసియా కప్పులో భాగంగా భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ శ్రీలంకలో జరుగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్ వాకర్ యూనిస్ ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.

Advertisement
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

తాజా వార్తలు