కళ్లు దురద పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకే!

క‌ళ్లు దుర‌ద పెట్ట‌డం.చాలా మందిని ఈ స‌మ‌స్య కామ‌న్‌గా వేధిస్తుంటుంది.

ఎక్కువ స‌మ‌యం పాటు కంప్యూట‌ర్లు, స్మార్ట్ ఫోన్లు చూడ‌టం వ‌ల్ల‌, ఎల‌ర్జీల వ‌ల్ల లేదా ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల క‌ళ్లు త‌ర‌చూ దుర‌ద పెడుతుంటాయి.దుర‌ద‌తో పాటు నొప్పి, అసౌక‌ర్యంగా కూడా అనిపిస్తుంది.

ఆ స‌మ‌యంలో ఏం చేయాలా తెలియ‌క నానా ఇబ్బందులు ప‌డుతుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పాటిస్తే.సులువుగా కంటి దుర‌ద‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.పాలు కంటి దుర‌ద‌కు చెక్ పెట్ట‌డంతో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
Home Remedies For Get Rid Of Eye Itching, Home Remedies, Eye Itching, Eye Care,

కొన్ని పాలు తీసుకుని.దూది సాయంతో క‌ళ్ల‌పై అప్లై చేసి మెల్ల మెల్ల‌గా రుద్దుకోవాలి.

అనంత‌రం పాల‌లో ముంచిన దూదిని క‌ళ్ల‌పై కాసేపు ఉంచుకుని.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు దుర‌ద పెట్ట‌డం త‌గ్గుముఖం ప‌డుతుంది.

Home Remedies For Get Rid Of Eye Itching, Home Remedies, Eye Itching, Eye Care,

అలాగే బంగాళదుంప కూడా కంటి దుర‌ద‌ను నివారించ‌గ‌ల‌దు.బంగాళ‌దుంప‌ను క‌ట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.బాగా కూల్ అయిన త‌ర్వాత‌.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

ఆ బంగాళ‌దుంప ముక్క‌ల‌ను తీసుకుని.కళ్ళ మీద పెట్టుకోవాలి.

Advertisement

ఇలా మంచి ఫ‌లితం ఉంటుంది.ఒక‌వేళ బంగాళ‌దుంప లేకుండా కీర‌దోస‌తో అయినా ఇలా ట్రై చేయ‌వ‌చ్చు.

ఎందుకంటే.కీరా కూడా కంటి దుర‌ద‌కు చెక్ పెట్ట‌గ‌ల‌దు.

క‌ల‌బంద కూడా కంటి దుర‌ద‌ను త‌గ్గించ‌డంలో మంచిగా స‌హాయ‌ప‌డుతుంది.ఇంట్లో పెంచుకునే కల‌బంద నుంచి గుజ్జున తీసుకుని.

క‌ళ్ల చుట్టూ అప్లై చేయాలి.బాగా ఆరిన త‌ర్వాత క‌ళ్ల‌ను క్లీన్ చేసుకుంటే కంటి దుర‌ద త‌గ్గుముఖం ప‌డుతుంది.

ఒక గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా కంటి దుర‌ద‌ను నివారిస్తుంది.గ్రీన్ టీ బ్యాగ్స్‌ను ఉప‌యోగించిన త‌ర్వాత ప‌డేయ‌కుండా.

ఫ్రీజ్‌లో పెట్టి కూల్‌గా అయిన త‌ర్వాత క‌ళ్ల‌పై పెట్టుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉటుంది.

తాజా వార్తలు