'లైగర్' సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ !

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

Advertisement

ఈ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది.

ఈ సినిమా కోసం విజయ్ స్పెయిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ఈ నేపథ్యంలో యాక్షన్ సీన్స్ డిజైన్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ను తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈయన హాలీవుడ్ లో అనేక సినిమాలకు పని చేసాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇప్పుడు లైగర్ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ను తీసుకున్నారు.ఇప్పటి కే ఈయన ఈ సినిమా కోసం తన బృందంతో కలిసి యాక్షన్ సీన్స్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

ఈ సినిమాలో విజయ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ను సెప్టెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు