వామ్మో వీళ్లు ప్లేయర్లా లేక వీధిరౌడీలా... ఇలా కొట్టుకుంటున్నారేంటి?

ఫుట్ బాల్ ఆటలో గొడవలు సహజమే.రెండు జట్ల ఆటగాళ్లు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

ఫుట్ బాల్ ఆటను తిలకించే వారికి ఈ గొడవలు పెద్ద విషయంలా అనిపించవు.గొడవలు జరిగినా కానీ రక్తాలు వచ్చేలా కొట్టుకోవడం మాత్రం అరుదు.

ఇలా ఓ దేశంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకున్నారు.ఎంతలా అంటే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వచ్చి ఆపినా కానీ ఆగలేదు.

అంతలా కొట్టుకున్న ఆటగాళ్లను చివరికి ఎలాగోలా కష్టపడి చివరికి భద్రతా సిబ్బంది విడదీశారు.ఇలా విడదీసిన ఆ ఆటగాళ్లకు చివరికి రిఫరీలు షాక్ ఇచ్చారు.

Advertisement

ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.ఆఫ్రికా దేశంలోని నేషన్స్ కప్ లో ఈ ఘటన చోటు చేసుంది.

ఘనా గాబన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరికి 1‌‌-1 తో డ్రాగా ముగిసింది.ఇలా ఈ మ్యాచ్ డ్రా కావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

మ్యాచులో చివరి నిమిషం వరకు ఘనా జట్టు లీడ్ లో ఉండగా.చివరకు మాత్రం మ్యాచ్ డ్రా అయింది.

దీంతో ఘనా ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు.ఇలా వారు అసహనానికి గురయినపుడు ఘనా ఆటగాడు బెంజమిన్ టెటెహ్ అనే స్ట్రైకర్ అవతలి జట్టు ఆటగాడి నోటి మీద పంచ్ ఇచ్చాడు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర గొడవ జరిగింది.ఇక భద్రతా సిబ్బంది ఆ గొడవ పెట్టుకునే వారిని విడతీసిన తర్వాత రిఫరీలు గొడవకు కారణం అయిన ఘనా ఆటగాడు బెంజమిన్ టెటెహ్ కు భారీ షాక్ ఇచ్చారు.

Advertisement

అతడు తదుపరి మ్యాచ్ ఆడకుండా అతడికి రెడ్ కార్డును జారీ చేశారు.

తాజా వార్తలు