కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీ మద్ధతుదారులు.. హిందూ ఆలయంపై పిచ్చిరాతలు, భారత్ ఆగ్రహం

ఖలిస్తాన్ ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న సిక్కు వేర్పాటువాదులు ఈ మధ్యకాలంలో కెనడాలో తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తున్నారు.ముఖ్యంగా హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ.

ఆలయ గోడలపై ఖలిస్తాన్ అనుకూల, భారత్ వ్యతిరేక రాతలను రాస్తున్నారు.తాజాగా కెనడాలోని మరో ప్రముఖ హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్ధతుదారులు ద్వేషపూరిత నినాదాలు రాశారు.

ఫిబ్రవరి 13న మిస్సిసాగాలోని రామ మందిరంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనపై టోరంటోలోని భారత కాన్సులేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రామమందిరాన్ని భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.ఈ ఘటనపై వీలైనంత త్వరగా విచారణ జరిపి.

Advertisement

నేరస్తులపై సత్వరం చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరినట్లు భారత కాన్సులేట్ కార్యాలయం ట్వీట్ చేసింది.అటు ఆలయ కమిటీ కూడా ఈ ఘటనపై స్పందించింది.

ఫిబ్రవరి 13న రాత్రి సమయంలో విధ్వంసం జరిగినట్లుగా తెలిపింది.ఈ ఘటనతో కమ్యూనిటీ సభ్యులు కలవరపాటుకు గురయ్యారని.

దీనిపై విచారణకు సంబంధించి అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేసింది.

కాగా.కెనడాలో హిందూ దేవాలయాన్ని ఖలిస్తాన్ మద్ధతుదారులు టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు.గత నెలలో బ్రాంప్టన్ నగరంలోని హిందూ దేవాలయం గోడలపై భారత్‌కు వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు రాశారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

గతేడాది సెప్టెంబర్‌లో టోరంటోలో బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్ కెనడియన్ ఖలిస్తానీ వేర్పాటువాదులతో ధ్వంసం చేయబడింది.నిజానికి బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ అనేది ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్ధ.

Advertisement

ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో భారతీయులపై విద్వేషపూరిత నేరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుదలను ఖండిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అప్పట్లోనే ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇదిలావుండగా.స్టాటిస్టిక్స్ కెనడా ప్రకారం.2019 నుంచి 2021 మధ్య మతం, లైంగిక ధోరణి, జాతి ఆధారంగా ద్వేషపూరిత నేరాలు 72 శాతం పెరిగాయి.ఇది అక్కడి మైనారిటీ వర్గాలలో భయాందోళనలకు దారితీసింది.

తాజా వార్తలు