హిందీ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులపై కొనసాగుతున్న రచ్చ

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.మొత్తం అవార్డులను కరణ్‌ జోహార్‌ తన అనుకున్న వారికి ఇచ్చుకున్నాడు అంటున్నారు.

గల్లీ బాయ్‌ చిత్రానికి ఏకంగా 13 అవార్డులు రావడమే ఇందుకు నిదర్శణం అంటూ పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు.అలాంటప్పుడు ఎందుకు వీటిని అందరికి అంటూ ప్రచారం చేయడం, కరణ్‌ జోహార్‌ సన్నిహితుల అవార్డులు అంటూ ప్రకటించవచ్చు కదా అంటున్నారు.

ఆలియా భట్‌కు గత ఏడాది మరియు ఈ ఏడాది కూడా వరుసగా అవార్డు దక్కింది.ఈ ఏడాదికి గాను ఈమె గల్లీ బాయ్‌ చిత్రంలో నటించినందుకు అవార్డును దక్కించుకుంది.అయితే ఆలియాకు వరుసగా అవార్డులు రావడంపై కంగనా రనౌత్‌ సిస్టర్‌ రంగోలి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

నటన రాకున్నా కూడా బ్యాక్‌ గ్రౌండ్‌ మంచి పరిచయాలు ఉంటే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు వస్తాయని ఆలియాను చూస్తుంటే అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.

Advertisement

ఆమె తల్లిదండ్రులు ఆమెకు నటన నేర్పించకున్నా కూడా జీహాద్‌ను బాగా నేర్పించారు.జీహాద్‌ అంటే తన ప్రతి సినిమాలో కూడా బుర్ఖా వేసుకోవడం వల్లే ఈమెకు అవార్డులు దక్కాయి అంటూ కామెంట్‌ చేసింది.మొత్తానికి రంగోలీతో పాటు పలువురు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు నిజాయితీగా ఇవ్వలేదని, అసలు ఇలాంటి అవార్డులు ఇవ్వొద్దంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ దెబ్బతో ఫిల్మ్‌ ఫేర్‌పై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోయిందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు