Sreeleela : నెలకొక సినిమా చొప్పున ఈ ఏడాది మొత్తం శ్రీ లీల సినిమాలే !

ప్రముఖ హీరోయిన్ శ్రీలీల( Heroine Sreeleela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లిసందడి( Pelli SandaD ) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.

ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించింది.ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.

శ్రీ లీల( Sreeleela Movies ) ఇండస్ట్రీ కి రాకముందు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ కనిపించేవారు.అలాంటిది శ్రీలీల వచ్చి వాళ్ళందరిని పక్కకు నెట్టేసింది.ఆమె అందం, అభినయం, నటన, డాన్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

దానికి తగ్గట్టుగానే శ్రీలీల వరుస అవకాశాలను దక్కించుకొని దూసుకుపోతుంది.ఇక నుండి రాబోయే ఐదు నెలల వరకూ ఈ అమ్మడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయబోతుంది.

ఆ సినిమా లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సెప్టెంబర్ 28 ఇద్, గణేష్ నిమర్జనం సందర్బంగా స్కంద ( Skanda ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా నటించారు.ఇక దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న

భగవంత్ కేసరి( Bhagavant Kesari )

సినిమాతో శ్రీలీల ప్రేక్షకులను పలకరించబోతుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఆ తరువాత నెలలో దీపావళి పండుగ సందర్బంగా నవంబర్ 10న ఆదికేశవ ( Adikeshava ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శ్రీలీల.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు.డిసెంబర్ లో క్రిస్టమస్ సందర్బంగా ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతుంది శ్రీలీల.

Advertisement

ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు.ఆ తరువాత సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12న గుంటూరు కారం( Guntur Karam ) సినిమాలో ప్రేక్షకులకు హాయ్ చెప్పనుంది.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు.ఇలా వరుసగా ఐదు నెలలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి రెడీ అయిందీ ముద్దుగుమ్మ.

తాజా వార్తలు