మొదటి సినిమాతో ఆకట్టుకున్న హీరోలు.. 2021 డేబ్యూ హీరోలు వీళ్ళే!

సాధారణంగా ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతో మంది కొత్త హీరోలు కొత్త హీరోయిన్లు అడుగుపెడుతున్నారు.

ఈ క్రమంలోనే కొందరి హీరోలకు వారి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.

ఇలా ఈ ఏడాది ఎంతో మంది హీరోలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి డేబ్యూ సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు.మరి 2021లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన డేబ్యూ హీరోలు ఎవరో ఇక్కడ ఒక లుక్ వేద్దాం.

ప్రదీప్ మాచిరాజు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ పలు పాత్రల్లో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.ఈ క్రమంలోనే సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ ఈ ఏడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ప్రదీప్ నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

తేజ స‌జ్జ‌:

చూడాలని ఉంది, గంగోత్రి, ఇంద్ర వంటి ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తేజ స‌జ్జ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఈయన ఏడాది జాంబిరెడ్డి అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్న తేజ ఆ తర్వాత ఇష్క్`, ఓటీటీ మూవీ `అద్భుతం`లోనూ సంద‌డి చేశాడు.

Advertisement

వైష్ణవ్ తేజ్

: మెగా కాంపౌండ్ నుంచి ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో వైష్ణవ్ తేజ్ ఒకరు.ఇతను ఉప్పెన సినిమా ద్వారా ఈ ఏడాది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీ వద్ద అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు.మొదటి సినిమానే  బ్లాక్ బస్టర్ విజయం కావడంతో వైష్ణవ్ తేజ్ కి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.

రోషన్

: సినిమా ఇండస్ట్రీ లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ వారసుడిగా రోషన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా పాతిక సంవత్సరాల తర్వాత రాఘవేంద్ర రావు దర్శక పర్యవేక్షణలో ఆయన కొడుకు హీరోగా పెళ్లి సందD అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు రోషన్.ఇలా ఈ హీరోలందరూ ఈ ఏడాది డేబ్యూ హీరోలుగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి విజయవంతమైన సినిమాలను వారి ఖాతాలో వేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు