డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన హీరో తరుణ్... మొదటి సారి ప్రయత్నం

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తరువాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చిన నటుడు తరుణ్.

మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తరువాత వరుసగా సక్సెస్ లు అందుకుంటూ లవర్ బాయ్ ఇమేజ్ తో తరుణ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా దూసుకుపోయాడు.

ఆ తరువాత కెరియర్ లో కొన్ని ఫ్లాప్ లు తగలడంతో క్రమంగా సినిమాలు కూడా తగ్గిస్తూ వచ్చేశాడు.అతనితో వచ్చిన హీరోలు అందరూ స్టార్ హీరోలు అయిపోతే తరుణ్ మాత్రం హీరోగా తన కెరియర్ ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నాడు.

అయితే అతనికున్న అమ్మాయిల ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉంది.ఇప్పటికి కూడా మళ్ళీ మునుపటి వేగంతో సినిమాలు చేయగలిగితే లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే సొంత వ్యాపారాలని చూసుకుంటూ వాటిలో బిజీ అయిపోయాడు.అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

తరుణ్ చివరిగా ఇది నా లవ్ స్టొరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే ఈ మూవీ నిరాశ పరిచింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తరుణ్ తన తల్లి రూట్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది.తరుణ్ తల్లి రోజారమణి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి తరువాత హీరోయిన్ అయ్యింది.

అనంతరం నటిగా ఫుల్ స్టాప్ పెట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.ఎన్నో సినిమాలకి హీరోయిన్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి గాత్రదానం చేసింది.

ఇప్పుడు తరుణ్ కూడా ఓ మలయాళీ డబ్బింగ్ మూవీకి మొదటి సారి డబ్బింగ్ చెప్పాడు.మలయాళీ హిట్ మూవీ అతిరన్ అనుకొని అతిథి పేరుతో తెలుగులో డబ్బింగ్ అయ్యింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఈ మూవీలో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించాడు.ఈ పాత్రకి తరుణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

Advertisement

సినిమా చూసినంత వరకు అతను ఈ మూవీకి డబ్బింగ్ చెప్పిన విషయం ఎవరికి తెలియదు.తెలిసిన తర్వాత సినిమాని తరుణ్ ఫాన్స్ అందరూ చూడటం మొదలు పెట్టారు.

అలాగే మొదటి సారి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అది థ్రిల్లర్ మూవీకి ఎలా చెప్పాడని చూడటానికి ఆహలోకి వచ్చి అనుకొని అతిథిని వీక్షిస్తున్నారు.మరి తరుణ్ ఇదే రూట్ లో కొనసాగుతాడా మళ్ళీ హీరోగా బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు