నా జీవితం లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది : హీరో సిద్ధార్థ్

తమిళ హీరో సిద్ధార్థ్( Hero Siddharth ) "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కూడా అందుకున్నాడు.

ఇందులో హీరోయిన్‌గా త్రిష నటించింది.ఈ సినిమా తర్వాత కొన్నేళ్లకి సిద్ధార్థ్ "బొమ్మరిల్లు"( Bommarillu ) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాడు.

ఇందులో హీరోయిన్‌గా జెనీలియా నటించింది.జెనీలియా, త్రిషలతో అతడు మంచి హిట్స్ పొందాడు.

అంతేకాదు, వారి కెమిస్ట్రీ కూడా చాలా బాగా పండింది.ఈ రెండు జోడీలకు చాలామంది అభిమానులు కూడా అయ్యారు.

Advertisement

అయితే ఒక ఇంటర్వ్యూలో, త్రిష జెనీలియా ఇద్దరిలో ఎవరంటే ఇష్టమో చెప్పాలని సిద్ధార్థ్ ను అడిగారు.దానికి అతడు "జెనీలియా"( Genelia ) అని టక్కున చెప్పాడు.

"జెనీలియా నా ఫ్యామిలీ మెంబర్ లాంటిది.మా ఇంట్లో అందరికీ ఆమె అంటే చాలా ఇష్టం, చాలా స్పెషల్ కూడా.నా పుట్టిన రోజు నాడు ఎవరు విష్ చేసినా, చేయకపోయినా జెనీలియా మాత్రం ఫోన్ చేసి కంపల్సరిగా విష్ చేస్తుంది.

జెనీలియా ఫోన్ చేయకపోతే నా బర్త్ డే జరగనట్లే.నా జీవితంలో జెనీలియా చాలా ఇంపార్టెంట్ పర్సన్.త్రిష బదులు వేరే ఎవరి పేరు చెప్పినా సరే నేను జెనీలియా పేరు మాత్రమే చెప్తాను.

ఎందుకంటే అంత స్పెషల్ ఆమె నాకు." అని సిద్ధార్థ్ జెనీలియా పట్ల తనకున్న ఇష్టాన్ని బయట పెట్టాడు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

ఈ హీరో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

సిద్ధార్థ్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా( Indian 2 Movie )లో ఒక కీలక రోల్ పోషిస్తున్నాడు.చిత్తా తమిళ్ మూవీ లో రీసెంట్ గా కనిపించాడు.ఇది తెలుగులో కూడా డబ్ అయి బాగానే రెస్పాన్స్ దక్కించుకుంది.

తెలుగులో అతడు చేసిన చివరి స్ట్రెయిట్ సినిమా మహాసముద్రం.జెనీలియా సై, హ్యాపీ, ఢీ, రెడీ వంటి ఇతర సినిమాలతోనూ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.ఇప్పుడు జూనియర్ సినిమా చేస్తోంది ఇది తెలుగు కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.2012లో రానా దగ్గుబాటి( Rana Daggubati ) తో కలిసి నా ఇష్టం మూవీ చేసింది.అదే ఈ ముద్దుగుమ్మ లాస్ట్ తెలుగు మూవీ, త్వరలో జూనియర్ సినిమాతో 12 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో అడుగు పెట్టనుంది.

తాజా వార్తలు