టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా మండిపడ్డారు.బడుగు, బలహీన వర్గాలను జగన్ కు దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ పాలనను మేధావులు మెచ్చుకుంటున్నారని మంత్రి మేరుగ తెలిపారు.రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక కార్యక్రమం కూడా చంద్రబాబు చేయలేదని విమర్శించారు.175 నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారన్నారు.అటు జనసేనాని పవన్ కల్యాణ్ కు స్థిరత్వం లేదని విమర్శించారు.