Hi Nanna Review: హాయ్ నాన్న మూవీ రివ్యూ అండ్ రేటింగ్?

నాచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా తాజాగా నటించిన చిత్రం హాయ్ నాన్న(Hi Nanna).

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాలో నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించారు.

తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.దసరా వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నాని ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.

కథ:

విరాజ్(నాని) ఒక ఫోటోగ్రాఫర్.సొంత స్టూడియో పెట్టుకొని ముంబైలో మోడల్స్ అందరికీ ఫోటోలు తీస్తూ ఉంటారు.

ఇక విరాజ్ కుమార్తె మహి (కియారా ఖన్నా) తో( Kiara Khanna ) కలిసి ఈయన నివసిస్తూ ఉంటారు.ఇక మహి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోదు దీంతో తన తల్లి ఎలా ఉంటుంది అంటూ తన తల్లి గురించి చెప్పమని తరచూ అడుగుతూ ఉంటుంది.

Advertisement
Hi Nanna Review: హాయ్ నాన్న మూవీ రివ్యూ �

ఇక మహి ఒక వింత వ్యాధితో బాధపడుతూ ఉంటుంది.అయితే విరాజ్ తల్లి గురించి చెప్పకపోవడంతో అలిగి మహి ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది.ఆ సమయంలోనే యష్ణ (మృణాల్) మహికి పరిచయమవుతుంది.

వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు.ఆ సమయంలోనే యష్ణ వల్ల విరాజ్ మహీకి అమ్మ కథ చెప్పాల్సి వస్తుంది.

మహి వాళ్ళ అమ్మ ఎవరు? యష్ణ విరాజ్ లైఫ్ లోకి వస్తుందా? మహి హెల్త్ కి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

Hi Nanna Review: హాయ్ నాన్న మూవీ రివ్యూ �

నటీనటుల నటన:

ఇక నాని( Nani ) ఎప్పటిలాగే ఈ సినిమాలో తన సహజ నటనతో అందరిని ఆకట్టుకున్నారు.తండ్రి కూతురు మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలలో నాని తన మార్క్ చూపించారు.బేబీ కియారా ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో నటించారు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే.. అంత తీసుకుంటున్నారా?

ఇక మృణాల్ కూడా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.ప్రియదర్శి( Priyadarshi ) జయరాం( Jayaram ) వంటి వారు వారి పాత్రలకు న్యాయం చేశారు ఇక శృతిహాసన్( Shruti Haasan ) కూడా ఒక పాటలో కనిపించి సందడి చేశారు.

Advertisement

టెక్నికల్:

డైరెక్టర్ తండ్రి కూతురు మధ్య ఎమోషనల్ సన్నివేశాలను చూపిస్తూనే ఈ కథకు ప్రేమ కథను( Love Story ) జోడించి ఎన్నో ట్విస్ట్ ల నడుమ సినిమాని అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈయన దర్శకత్వ ప్రతిభ చూస్తుంటే కొత్త దర్శకుడు సినిమా చేశారు అన్న భావన కలగదు.ఇక నాని ఇందులో ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు కనుక కెమెరా విజువల్స్ కూడా అద్భుతంగా వచ్చాయి.

పాటలు( Songs ) పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఎమోషనల్ సన్నివేశాలలో బిజిఎం అద్భుతంగా ఉంది.ఇక నిర్మాణాత్మక విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ:

సినిమా ప్రారంభంలో నాని, కూతురు సెంటిమెంట్ ని చూపిస్తారు.ఆ తర్వాత నాని అమ్మ కథ చెప్పమన్నప్పుడు నాని అనుకోకుండా హీరోయిన్ కథను ఊహిస్తూ చెబుతుంటాడు.ఇక మహి( Mahi ) అనారోగ్యానికి గురైనప్పుడు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఇంటర్వెల్ లో ఓ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించనంతగా సినిమా కథని నడిపించాడు దర్శకుడు.దీంతో ఇంటర్వెల్ తర్వాత సినిమాపై ఎంతో ఆసక్తి కలిగించారు.ఇక క్లైమాక్స్ లో కూడా ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలలో బిజిఎం.

మైనస్ పాయింట్స్:

పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి అక్కడక్కడ రోటీన్ సన్ని వేషాలు.

బాటమ్ లైన్:

ఇప్పటివరకు ఇలా తండ్రి కూతురు మధ్య కొనసాగే ఎమోషన్స్ తో కూడిన సినిమాలు వచ్చాయి.ఇక ఈ సినిమా కూడా అలాంటి కథతో వచ్చినప్పటికీ మధ్యలో ట్విస్టులు ప్రేమ కథ అద్భుతంగా చూపించారు.

మొత్తానికి నాని మరొక హిట్ అందుకున్నారని చెప్పాలి.

రేటింగ్: 2.75/5

తాజా వార్తలు