వరదల్లో ఇరుక్కుపోయిన హీరో అక్కినేని నాగార్జున..

అదేంటి? సినిమా హీరో నాగార్జున( Nagarjuna ) వరదల్లో చిక్కుకు పోవడం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ.

అయితే ప్రకృతి విపత్తు ముందు ఎవరైనా ఒకటే అని తాజా సంఘటన రుజువు చేస్తోంది.

విషయం ఏమిటంటే, హీరో నాగార్జున తాజాగా వరదల్లో చిక్కుకొని, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం చాలా చోట్ల వర్షాకాలం కారణంగా వరదలు సంభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మరీ ముఖ్యంగా రాయలసీమలో గల అనంతపురం జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని సమాచారం.

Hero Akkineni Nagarjuna Trapped In Floods, Akkineni Nagarjuna, Floods, Tollywoo

అనంతపురం జిల్లా( Anantapur )లోని వరదల కారణంగా రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి.ఈ తరుణంలోనే కింగ్ నాగార్జున ఓ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు.గత కొన్ని సంవత్సరాల నుండి నాగార్జున కళ్యాణ్ జువెలరీ (, Kalyan Jewellers )సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Advertisement
Hero Akkineni Nagarjuna Trapped In Floods, Akkineni Nagarjuna, Floods, Tollywoo

కాగా, అనంతపురం జిల్లాలోని కొత్తగా ఏర్పాటు చేసిన కళ్యాణ్ జ్యువలరీ షాపుకు వెళ్లబోతున్న నాగార్జున మార్గమధ్యంలోనే వరదల కారణంగా చిక్కుకుపోయారు.

Hero Akkineni Nagarjuna Trapped In Floods, Akkineni Nagarjuna, Floods, Tollywoo

దాంతో, విషయం తెలుసుకున్న జువెలరీ నిర్వాహకులు, స్థానిక నాయకులు కలిసి నాగార్జునను ఎలాగైనా, ఆ ట్రాఫిక్కు బారి నుండి మళ్లించి తొందరగా జ్యువెలరీ షోరూం వద్దకు చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇకపోతే కింగ్ నాగార్జున సినిమాల విషయంలో వారి ఇద్దరు కుమారుల కంటే స్పీడ్ గా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా కొన్ని బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల్లో కూడా కింగ్ నాగార్జున నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు