చ‌ర్మంపై ముడ‌త‌లు రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్ర‌త్త‌లు ఇవే!

వ‌య‌సు పైబ‌డే కొద్ది చ‌ర్మంపై ముడ‌త‌లు ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

ఇందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.ఏదేమైనా ముడ‌త‌లు వ‌చ్చాక బాధ ప‌డ‌టం కంటే.

అవి రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఎంతో మేలంటున్నారు చ‌ర్మ నిపుణులు.మ‌రి ఇంత‌కీ ముడ‌త‌లు రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్ర‌త్త‌లు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

స‌రైన పోష‌కాలు అంద‌క‌పోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది.ఫ‌లితంగా ముడ‌త‌ల‌తో స‌హా అనేక స్కిన్ ప్రోబ్ల‌మ్స్ ఎదుర‌వుతాయి.

Advertisement
Here Are The Precautions To Take To Prevent Wrinkles On The Skin! Precautions, W

అందుకే చ‌ర్మ ఆరోగ్య కోసం విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, విట‌మిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

Here Are The Precautions To Take To Prevent Wrinkles On The Skin Precautions, W

అలాగే నిద్ర త‌క్కువైనా లేదా ఎక్కువైనా ముడ‌త‌లు వ‌స్తుంటాయి.అందుకే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించాలి.శ‌రీరక శ్ర‌మ లేక‌పోవ‌డాన్ని కూడా చ‌ర్మంపై ముడ‌త‌లు రావ‌డానికి ఒక కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

కాబ‌ట్టి, ప్ర‌తి రోజు క‌నీసం ఇర‌వై నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి.అప్పుడే ఆరోగ్యంగా మ‌రియు య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

Here Are The Precautions To Take To Prevent Wrinkles On The Skin Precautions, W

చాలా మంది స‌న్ స్క్రీన్‌ను ఎవైడ్ చేస్తారు.దాంతో ఎండ‌ల ప్ర‌భావం వ‌ల్ల చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌లు వ‌చ్చేస్తాయి.అందుకే బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌ని స‌రిగా స‌న్ స్క్రీన్‌ను రాసుకోవాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇక నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేక‌ప్‌ను పూర్తిగా తొల‌గించి ఫేస్ వాష్ చేసుకోవాలి.వాట‌ర్ ఎక్కువ‌గా సేవించాలి.శ‌రీర బరువును కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

Advertisement

మ‌రియు నిద్రించే స‌మ‌యంలో బోర్లా లేదా ప‌క్క‌కు కాకుండా వెల్లకిలా పడుకోవడం అల‌వాటు చేసుకోవాలి.త‌ద్వారా చ‌ర్మంపై త్వ‌ర‌గా ముడ‌త‌లు రాకుండా ఉంటాయి.

తాజా వార్తలు