య‌వ్వ‌న‌ చ‌ర్మం కోసం పురుషులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే!

య‌వ్వ‌నంగా క‌నిపించాల‌నే కోరిక స్త్రీల‌కే కాదు పురుషులకూ ఉంటుంది.

కానీ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉంచుకోవ‌డానికి ఏం చేయాలి, అస‌లు ఏయే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి వంటి విష‌యాల‌పై పురుషుల‌కు స‌రైన అవ‌గాహ‌న ఉండ‌దు.

అందుకే చాలా మంది పురుషులు చిన్న వ‌య‌సులోనే య‌వ్వ‌నాన్ని కోల్పోతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే గ‌నుక చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మెరిసిపోవ‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.చ‌ర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించుకోవాలి.

లేకుంటే చ‌ర్మ ఛాయ త‌గ్గ‌డ‌మే కాదు త్వ‌ర‌గా ముడ‌త‌లు కూడా వ‌చ్చేస్తాయి.అందుకే వారంలో రెండు సార్లు షుగ‌ర్‌కు తేనెను క‌లిపి ముఖాన్ని స్క్ర‌బ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే మృత క‌ణాలు పోయి.చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

అలాగే చాలా మంది పురుషులు ఎండ‌ల్లో విప‌రీతంగా తిరుగుతుంటారు.కానీ, సన్‌స్క్రీన్‌ను మాత్రం రాసుకోరు.

ఫ‌లితంగా చ‌ర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.చ‌ర్మం ఎప్పుడూ య‌వ్వ‌నంగా, ఆరోగ్యంగా ఉండాలంటే బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా స‌న్ స్క్రీన్‌ను అప్లై చేసుకోవాలి.

షేవింగ్ చేసుకున్న త‌ర్వాత ఖ‌చ్చితంగా మీ స్కిన్‌కి సూట్ అయ్యే మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.లేదా అలోవెర జెల్‌ను అప్లై చేసుకుని కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
News Round up: న్యూస్ రౌండప్ టాప్ 20

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది.

Advertisement

కొంద‌రు పురుషులు ఆయిలీ స్కిన్‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అలాంటి వారు ఎగ్ వైట్‌ను హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేయాలి.ఇప్పుడు టిష్యూ పేపర్స్‌ని ముఖం ప‌రిచి.

డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే ఆయిలీ స్కిన్ స‌మ‌స్య దూరం అవ్వ‌డంతో పాటు చ‌ర్మం టైట్‌గా కూడా మారుతుంది.ఇక య‌వ్వ‌న చ‌ర్మం కోసం మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌ను మానుకోవాలి.

వాట‌ర్ ఎక్కువ‌గా తాగాలి.గంట‌లు గంట‌లు ఫోన్ మాట్లాడ‌టం త‌గ్గించాలి.

డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాలి.మ‌రియు ప్ర‌తి రోజు వ్యాయామాలు చేయాలి.

తాజా వార్తలు