విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ పై నేడు విచారణ

విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సీఐడీ పిటిషన్ పై నిన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఇవాళ ఏసీబీ కోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.

కాగా చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సీఐడీ కోర్టుకు తెలిపింది.ఈ క్రమంలో వాదనలు అనంతరం ఏసీబీ కోర్టు వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు