హుజూరాబాద్ ఫలితంపై టీఆర్ఎస్ కు ఓ క్లారిటీ వచ్చినట్టేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతున్న విషయం తెలిసిందే.

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు ఇప్పుడు  ఇటు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

అయితే హుజూరాబాద్ లో గెలుపుపై ఇటు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చాలా వరకు నమ్మకంగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఈటెల రాజేందర్ ఆత్మగౌరవ నినాదం టీఆర్ఎస్ కు కొంచెం గుబులు పుట్టిస్తున్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాకముందే హుజూరాబాద్ లో ఒడిపోతే టీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదు అని కెసీఆర్ చేసిన వ్యాఖ్య ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు అచ్చం ఇలాగే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొక్క సారి హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోయినా టీఆర్ఎస్ అసలు ఏ మాత్రం నష్టం వాటిల్లే అవకాశం ఏమీ ఉండదని అన్నారు.అయితే ఎన్నిక జరిగే ముందు సాక్షాత్తు మంత్రులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చేయడం ద్వారా పార్టీ గెలుపు కోసం పోరాటం చేస్తున్న కార్యకర్తలు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

Advertisement

అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియాలో హల్  చల్ చేస్తున్న పరిస్థితి ఉంది.ఎప్పడూ ఏ అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తున్న బీజేపీకి ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు టీఆర్ఎస్ నుండి రావడం ఇప్పుడు బీజేపీ కి సువర్ణవకాశంగా మారింది.

ఏది ఏమైనా టీఆర్ఎస్ పరోక్షంగా తమ ఓటమిని అంగీకరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు